పాపం... స్టార్ క్రికెటర్ రెండో బ్రేకప్?
ఉన్నట్లుండి సోషల్ మీడియాలో జాస్మిన్‌ను హార్దిక్ పాండ్యా అన్‌ఫాలో అయ్యాడు. అంతే కాకుండా హార్దిక్‌ను సైతం జాస్మిన్ అన్ ఫాలో కొట్టింది.
By: Tupaki Desk | 19 July 2025 9:00 PM ISTఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ యొక్క ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ వ్యవహారాలు ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అదే స్థాయిలో క్రికెట్స్ యొక్క లవ్ స్టోరీలు, వారి బ్రేకప్ వ్యవహారాలు ప్రచారం జరుగుతున్నాయి. ఫిల్మ్ స్టార్స్ రేంజ్‌లో క్రికెటర్స్‌కి క్రేజ్ ఉన్న నేపథ్యంలో వారి ప్రేమ కథలు, బ్రేకప్ విషయాలు ఎప్పుడూ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. సినిమా స్టార్స్ బ్రేకప్ సమయంలో హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో, అదే స్థాయిలో క్రికెటర్స్ బ్రేకప్ విషయంలోనూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
టీం ఇండియా వరుస విజయాల్లో, ముంబై ఇండియన్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హార్దిక్ పాండ్యా గతంలో నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి జంటకు మంచి పేరు వచ్చింది. ఇద్దరూ చాలా అందంగా, అన్యోన్యంగా ఉన్నారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉండేవి. ఇద్దరు పెళ్లి చేసుకుని, వైవాహిక జీవితం అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల సమయంలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. ఎందుకు వీరు విడిపోయారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ విడాకుల సమయంలో హార్ధిక్ పాండ్యా చాలా పెయిన్ అనుభవించినట్లుగా సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టాడు.
నటాషా సైతం చాలా సార్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం ద్వారా హార్ధిక్ పాండ్యా పై డైరెక్ట్ విమర్శలు చేసింది. నటాషా నుంచి విడిపోయిన తర్వాత కొంత కాలం సింగిల్‌గా లైఫ్‌ను లీడ్ చేసిన హార్దిక్ కొన్నాళ్ల క్రితం నుంచి బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియాతో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం జరిగింది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నన్ని రోజులు హార్దిక్‌ను జాస్మిన్ వదిలి పెట్టలేదు. చివరకు ముంబై ఇండియన్స్ బస్సులోనూ ఆమె ప్రయాణించింది. స్టేడియంలో కనిపించడంతో పాటు, పార్టీలు, పలు కార్యక్రమాల్లోనూ వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. దాంతో వీరి ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసింది, అందరూ వీరు వివాహం చేసుకుంటారని అనుకున్నారు.
ఉన్నట్లుండి సోషల్ మీడియాలో జాస్మిన్‌ను హార్దిక్ పాండ్యా అన్‌ఫాలో అయ్యాడు. అంతే కాకుండా హార్దిక్‌ను సైతం జాస్మిన్ అన్ ఫాలో కొట్టింది. ఈ మధ్య కాలంలో ఇలా అన్ ఫాలో అయ్యారు అంటే బ్రేకప్ అయినట్లుగా గుర్తు. సోషల్ మీడియాలో మంచిగా ఉన్నప్పుడు ఫాలో అయ్యి, బ్రేకప్ అయినప్పుడు అన్‌ఫాలో కావడం కామన్ అయింది. అందుకే వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం అన్ ఫాలో వల్లే వీరిద్దరూ విడిపోయారు అనే విషయం కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో రేంజ్ ఉన్న హార్దిక్ పాండ్యా కి రెండో సారి బ్రేకప్ కావడంతో ఆయన ఫ్యాన్స్ అయ్యో పాపం అంటున్నారు. ఈ బ్రేకప్ కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
