Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ కి విమానంలో వేధింపులు

సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... మలయాళ నటి దివ్య ప్రభ అక్టోబర్ 10వ తారీకు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి కొచ్చి కి ప్రయాణించింది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 11:06 AM GMT
హీరోయిన్‌ కి విమానంలో వేధింపులు
X

ఆడవారి పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తున్నా కూడా ఫలితం ఉండటం లేదు. ప్రతి రోజు ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో వందలాది మంది అమాయకపు ఆడవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గించేందుకు పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన కూడా.. కోర్టులు కఠిన శిక్షలు వేస్తున్నా కూడా అలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

సాధారణ అమ్మాయిలు, ఆడవారికి మాత్రమే కాకుండా సెలబ్రెటీలకు, హీరోయిన్స్ కి కూడా లైంగిక వేదింపులు తప్పడం లేదు. ఇండస్ట్రీలో చాలా మంది తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అంటూ ఉంటారు. అయితే హీరోయిన్‌ దివ్య ప్రభ తనను ఒక వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో లైంగికంగా వేధించాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... మలయాళ నటి దివ్య ప్రభ అక్టోబర్ 10వ తారీకు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి కొచ్చి కి ప్రయాణించింది. ఆ సమయంలో పక్క సీటులో ఉన్న వ్యక్తి తాగి ఉన్నాడట. హీరోయిన్‌ దివ్య ప్రభతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా ఆమెను అవమానకరంగా మాట్లాడట.

ఆ విషయాన్ని దివ్య ప్రభ వెంటనే ఎయిర్ హోస్టెస్‌ కి చెప్పగా సీటు మార్చిందట. ఆ తర్వాత కొచ్చి ఎయిర్‌ పోర్ట్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే కూడా వారు సరిగా పట్టించుకోలేదట. దాంతో దివ్య ప్రభ ఈమెయిల్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా దివ్య ప్రభ చెప్పుకొచ్చింది.

ప్రయాణికుల భద్రత పట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిర్‌ ఇండియా వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనపై అసభ్యంగా లైంగిక వేదింపులకు పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ ఆమె డిమాండ్‌ చేస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు చివరకు ఎటు వెళ్తుందో చూడాలి.