Begin typing your search above and press return to search.

ప్రభాస్​.. వ్యక్తిత్వం నోబుల్.. ఇమేజ్ గ్లోబల్.. స్టార్ డమ్ అన్ మ్యాచబుల్!

By:  Tupaki Desk   |   22 Oct 2023 4:08 PM GMT
ప్రభాస్​.. వ్యక్తిత్వం నోబుల్.. ఇమేజ్ గ్లోబల్.. స్టార్ డమ్ అన్ మ్యాచబుల్!
X

రెండు దశాబ్దాల క్రితం గల్లీ కుర్రాడిగా వచ్చి.. జగమంత కుటుంబాన్ని సొంతం చేసుకున్నారాయ. అభిమానులు ఆయన్ను ముద్దుగా డార్లింగ్‌ అని పిలుచుకుంటారు. ఎప్పుడూ మిస్టర్‌ పర్‌ఫెక్ట్​గా​ కనిపించే ఆయన... ఒంట్లోని అణువణువు పౌరుషంతో కదం తొక్కే మిర్చిలాంటోడు కూడా. అందుకే ఆయన ఒక్క అడుగు అంటూ హీరోయిజం చూపించగానే అంతా వెనక నిలబడ్డారు. అంతే అమరేంద్ర బాహుబలిగా ప్రమాణ స్వీకారం చేసి బాక్సాఫీస్​ ముందు కత్తులతో కాసులను కొలగొట్టేశారాయన. సాహోగా రికార్డులన్నింటినీ తన ముందు దాసోహం అయ్యేలా చేశారు. రాధేశ్యామ్​గా ప్రేమను పంచి ఆదిపురుషుడిగా అభిమానుల మనసుల్లో నిలిచారు. ఆయనే ప్రభాస్. రెబల్‌ స్టార్‌ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.లవర్‌బాయ్‌గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా, మాస్‌ హీరోగా, అమరేంద్ర బాహుబలి, ఆదిపురుషుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన.. రూ.వందకోట్లకే పరిమితమైన టాలీవుడ్​ మార్కెట్‌ను రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటారు. బాలీవుడ్‌ స్టార్‌ సినిమాలకు లేనంత బడ్జెట్‌.. దాదాపు రూ. రూ.1500 వేల కోట్లకు పైగా బడ్జెట్​తో ప్రస్తుతం మూడునాలుగు సినిమాల్లో నటిస్తున్న ఆయన పుట్టినరోజు నేడు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య.. ఇలా తెలుగు తెర దిగ్గజాల స్ఫూర్తిని, లెగసీని కొనసాగిస్తూ మన సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో ప్రభాస్... మహేశ్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్​తో పోటీగా వచ్చి వారందరికి మించి తొలి పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. ప్రభాస్ కెరీర్​ను గమనిస్తే... ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టిన ఆయన.. తొలి చిత్రంలోనే.నటనలో ఆత్మవిశ్వాసం, పరిణితి ప్రదర్శించి సక్సెస్​ను అందుకున్నారు. ఫ్యూచర్ స్టార్ అవుతారన్న నమ్మకాన్ని క్రియేట్​ చేసి అలానే ఎదిగారు. వర్షంతో తొలిసారి బిగ్ కమర్షియల్ సూపర్ హిట్ అందుకున్నారు. ఛత్రపతి మాస్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నారు. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్​కు బాగా దగ్గరయ్యారు. 'రాఘవేంద్ర' 'అడవిరాముడు', 'చక్రం', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా', 'బుజ్జిగాడు' 'బిల్లా', 'ఏక్‌నిరంజన్‌' 'రెబల్‌'...వంటి సినిమాలన్నీ ఆయలోని వైవిధ్యతను చూపించాయి. మిర్చి..ఆయన కెరీర్​లోనే ఓ స్పెషల్ సూపర్ హిట్​గా నిలిచింది. బాహుబలి సిరీస్​తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

టాలీవుడ్​ బాక్సాఫీస్ మార్కెట్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మొదట ప్రభాస్​కే దక్కుతుంది. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని రికార్డులెన్నో ప్ర‌భాస్ తిర‌గ‌రాశారు. తెలుగు సినిమాకు 2000 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించే స‌త్తా ఉంద‌ని నిరూపించారు. ఓవ‌ర్‌సీస్ మార్కెట్‌లో ప‌ది మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన తొలి హీరోగా నిలిచారు.

ప్రభాస్​కు దేశవ్యాప్తంగానే కాకుండా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి విదేశాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రభాస్‌ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలోనూ ప్రతిష్టించారు. ఈ మ్యూజియంలో వ్యాక్స్ స్ట్యాచ్యూ కలిగిన తొలి సౌత్ స్టార్ ప్రభాసే కావడం ఓ విశేషం.

ఆయన రీల్​లో మాత్రే కాదు రియల్ హీరో కూడా. విరాళాలు ఇవ్వడంలో ప్రభాస్ ది పెద్ద చేయి. గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్​లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు. 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని... తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నీ సమాజం పట్ల, తన అబిమానుల పట్ల ప్రభాస్​కు ఉన్న ప్రేమకు నిదర్శనం. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు సంపాదించుకుంటున్న తొలి సౌత్ హీరో గా కూడా రికార్డ్స్ క్రియేట్ చేశారు. సింపుల్​గా చెప్పాలంటే.. ఆయన వ్యక్తిత్వం నోబుల్...ఇమేజ్ గ్లోబల్...స్టార్ డమ్ అన్ మ్యాచబుల్.

ప్రస్తుతం ప్రభాస్ భారీ సినిమాల లైనప్ బడ్జెట్​ రూ.1500కోట్లకు పైమాటే. ఆయన.. హోంబలే ఫిలింస్ ప్రొడక్షన్​ హౌస్​లో దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్​లో చేస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుది. ఈ సినిమా మీద దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత మళ్లీ అలాంటి హిట్​ను ప్రభాస్​​ ఈ చిత్రంతో అందుకుంటారని అంతా ఆశిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్​ నిర్మిస్తున్న కల్కి 2898ఏడీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్​లోనూ ప్రభాసే హీరో. ప్రపంచస్థాయి టెక్నాలజీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది అంతా భావిస్తున్నారు.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఓ హారర్ మూవీ చేస్తున్నారు. ప్రభాస్ ను కొత్త జానర్ లో, సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. టీ సిరీస్ నిర్మాణంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించే స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నారు ప్రభాస్​. ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ త్వరలోనే విడుదల కానున్నాయి. మరిన్ని చిత్రాలను ఆయన లైనల్​లో పెట్టారు. ఈ సినిమాలతో మరిన్ని గ్రాండ్ హిట్​లు అందుకోవాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్.