Begin typing your search above and press return to search.

ప్రభాస్ హను.. ఓపెనింగ్ ఎప్పుడంటే..!

టాలీవుడ్ లవ్ స్టోరీ స్పెషలిస్ట్ గా హనుకి మంచి క్రేజ్ ఉంది. ప్రభాస్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన లవ్ స్టోరీ ని వినిపించనున్నాడు

By:  Tupaki Desk   |   28 Aug 2023 8:20 AM GMT
ప్రభాస్ హను.. ఓపెనింగ్ ఎప్పుడంటే..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ తన పాన్ ఇండియా సినిమాలతో నేషనల్ లెవెల్ లో తన ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఆల్రెడీ రీసెంట్ గా ఆదిపురుష్ అంటూ వచ్చిన ప్రభాస్ త్వరలో సలార్ పార్ట్ 1 తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించబోతున్నాడు. బాహుబలి నుంచి ప్రభాస్ సాలిడ్ హిట్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సలార్ సెన్సేషన్ సృష్టించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ K.G.F రెండు భాగాలతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ టాలెంట్ తెలిసింది.

ఇక ఇప్పుడు ఆ మేనియా కొనసాగించేలా ప్రభాస్ సలార్ ని తీర్చిదిద్దుతున్నాడు. ప్రభాస్ సలార్ 1 టీజర్ తోనే గూస్ బంప్స్ తెప్పించగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. సలార్ తర్వాత కల్కి సినిమా కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతుంది. 2024 సమ్మర్ లో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక మరోపక్క ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా చివరి దశకు చేరుకుంది.

ఆ సినిమా రిలీజ్ పై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సీతారామం డైరెక్టర్ హను రాఘవపుడి తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నారు. దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే ముహూర్త కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తుంది. దసరాకి ఈ ప్రాజెక్ట్ లాక్ చేస్తారని తెలుస్తుంది. ప్రభాస్ కోసం హను మరో క్రేజీ లవ్ స్టోరీ సిద్ధం చేశారట. ఈ సినిమా కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని టాక్.

టాలీవుడ్ లవ్ స్టోరీ స్పెషలిస్ట్ గా హనుకి మంచి క్రేజ్ ఉంది. ప్రభాస్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన లవ్ స్టోరీ ని వినిపించనున్నాడు. వరుస సినిమాలతో ప్రభాస్ తన ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సలార్ నుంచి ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అంతా విజిల్స్ వేసే సినిమాలే ఉన్నాయని లిస్ట్ చూస్తే అర్ధమవుతుంది. సందీప్ వంగా తో స్పిరిట్ కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నట్టు అర్థమవుతుంది. యానిమల్ రిలీజ్ అవ్వగానే ప్రభాస్ తో స్పిరిట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లానింగ్ లో ఉన్నాడు సందీప్. సో స్పిరిట్, హను రెండు సినిమాలు కూడా ఒకేసారి షూట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.