Begin typing your search above and press return to search.

సీతారామం 2 ఉంటుంది కానీ..?

హను రాఘవపుడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సీతారామం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Feb 2024 6:00 AM GMT
సీతారామం 2 ఉంటుంది కానీ..?
X

హను రాఘవపుడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సీతారామం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ పెయిర్ గా నటించగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో రష్మిక మందన్న నటించింది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ కూడా ఎంతో హెల్ప్ అయ్యింది. అప్పటివరకు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు రాని మృణాల్ ఠాకూర్ సీతరామం తో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రలో మృణాల్ నటన ఆకట్టుకుంది.

మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ తో వైజయంతి బ్యానర్ అదే రేంజ్ సీతారామం తో కూడా అందుకుంది.సీతారామం వెండితెర మీద చేసిన మ్యాజిక్ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సినిమా చివర్లో రామ్ కోసం సీత అదే నూర్జహాన్ ఎదురుచూస్తూ ఆమె కథ కూడా పూర్తవుతుంది. ఈ పాత్రలకు బాగా ఎంగేజ్ అయిన ఆడియన్స్ ఆ సినిమాను కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. హను రాఘవపుడి కూడా సీతారాం 2 పై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.

హను రాఘవపుడి ప్రభాస్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. అయితే ఆ సినిమా 2025 చివర్లో కానీ 2026 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈలోగా సీతారామం 2 కథ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట హను. సీతారామం 2 ఉంటుంది కానీ సీతా రామ కథలు అక్కడితో పూర్తయ్యాయి అయితే ప్రేక్షకులు ఆ పాత్రల మీద ఏర్పరచుకున్న అభిమానంతో మరో కొత్త కథలో వారిద్దరిని భాగం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎలాగు పాత్రలు వాటి స్వభావాలు ప్రేక్షకులకు ఎక్కేశాయి కాబట్టి వాటితోనే కొత్త కథ చెబితే ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.

హను ప్రస్తుతం ఆ ప్లానింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో సీతారామం 2 ఉంటే మాత్రం మరోసారి దుల్కర్ సల్మాన్, మృణాల్ కలిసి నటించే అవకాశం ఉంది. ఈ హిట్ పెయిర్ జత కడితే చూడాలని ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. వైజయంతి బ్యానర్ లో వస్తున్న కల్కి సినిమాలో కూడా దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సో దుల్కర్ తెలుగు సినిమాలన్నీ ఆ బ్యానర్ లోనే చేస్తుండటం స్పెషల్ గా చెప్పుకోవచ్చు.