Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ వార్ ల‌వ్ స్టోరీలో ప్ర‌భాస్!

మ‌రి వీట‌న్నింటికి ప్ర‌భాస్ ఎలా డేట్లు కేటాయిస్తో చూడాలి. ఇవి గాక తాజాగా హ‌నురాఘ‌వ‌పూడితో కూడా ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:27 AM GMT
వ‌ర‌ల్డ్ వార్ ల‌వ్ స్టోరీలో ప్ర‌భాస్!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం 'క‌ల్కీ 2898' పూర్తి చేసి మేలో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మేలోనే రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అందుకు త‌గ్గ‌ట్టే పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఇది పూర్త‌యిన వెంట‌నే డార్లింగ్ కొన్ని నెల‌లు విశ్రాంతి తీసుకుంటాడు. తిరిగొచ్చిన త‌ర్వాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ' రాజాసాబ్ 'ని పూర్తిచేస్తాడు.

ఇప్ప‌టికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. డార్లింగ్ లేని స‌న్నివేశాల‌న్ని దాదాపు పూర్తి కావొచ్చాయి. ప్ర‌భాస్ సీన్ లోకి వ‌స్తే మిగ‌తా పెండింగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాల‌ని మారుతి వెయిట్ చేస్తున్నాడు. కానీ అందుకు కాస్త స‌మ‌యం ప‌డుతుంది. మ‌రోవైపు 'స‌లార్-2'ని సైతం మొద‌లు పెట్టాల‌ని ప్ర‌శాంత్ నీల్ రెడీ అవుతున్నాడు. 15 నెల‌ల్లోనూ పూర్తి చేయాల‌న్న‌ది హోంబ‌లే టార్గెట్.

ఆ ర‌కంగా పూర్తి చేస్తామ‌ని ప్రామిస్ కూడా చేసారు. ఈ నేప‌థ్యంలో 'స‌లార్ -2'ని డిలే చేయ‌కూడ‌ద‌ని ప్ర‌శాంత్ నీల్ పావులు క‌దుపుతున్నాడు. ఆ సినిమా ఎప్పుడైనా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా డార్లింగ్ తో 'స్పిరిట్' చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు. సెప్టెంబ‌ర్ నుంచి మొద‌లవ్వొచ్చ‌ని ఆయ‌న హింట్ కూడా ఇచ్చారు. మ‌రి వీట‌న్నింటికి ప్ర‌భాస్ ఎలా డేట్లు కేటాయిస్తో చూడాలి. ఇవి గాక తాజాగా హ‌నురాఘ‌వ‌పూడితో కూడా ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

దీన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ట్లు వినిపిస్తుంది. తాజాగా దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇది వ‌ర‌ల్డ్ వార్ నేప‌థ్యంలో సాగే అద్భుత‌మైన ల‌వ్ స్టోరీ అంటున్నారు. అధికారిక ప్ర‌క‌ట‌న రాక ముందే సినిమా లైన్ లీక్ అవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈసినిమా గురించి పూర్తి వివ‌రాలు ప్ర‌భాస్ పుట్టిన రోజైన అక్టోబ‌ర్ 23 న ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. న‌వంబ‌ర్ లో పూజా కార్య‌క్ర‌మాలు కూడా ముగించి డిసెంబ‌ర్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేలా స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ఫిలిం సర్కిల్స్ లో చ‌ర్చ‌కొస్తుంది. మ‌రి ఈ ప్రచారంలో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.