Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఈ డైరెక్టర్ కూడా సైలెంటుగానే..

అతను మరెవరో కాదు సీతారామం సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి.

By:  Tupaki Desk   |   26 Feb 2024 10:08 AM GMT
ప్రభాస్.. ఈ డైరెక్టర్ కూడా సైలెంటుగానే..
X

సాధారణంగా పెద్ద హీరోతో సినిమా అంటే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడం నుంచే చాలా హడావిడి మొదలవుతుంది. ఇక ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేయబోతున్నాము అంటే ఏ దర్శకుడైన ఎగిరి గంతేసి ఆ విషయాన్ని అందరితోనూ చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఈ రోజుల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభాస్ తో సినిమా సెట్ అయినా కూడా దర్శకులు మాత్రం చాలా వరకు సైలెంట్ గానే వారి పనులను కొనసాగిస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అంచనాలు ఎక్కువగా పెంచకూడదు అని అనుకుంటున్నారో? లేదంటే ఎక్కువ హడావిడి చేస్తే దిష్టి తగులుతుంది అనుకున్నారో.. ఏమో కానీ కొంతమంది దర్శకులు మాత్రం ప్రభాస్ తో కథ చెప్పడం నుంచి ఫ్రీ ప్రొడక్షను పనుల వరకు సౌండ్ లేకుండా వర్క్ చేసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక మారుతి అదే తరహాలో ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

సగం వరకు షూటింగ్ వచ్చినా కూడా అఫీషియల్ గా ఒక పోస్టర్ విడుదల చేయకపోవడం విశేషం. మొత్తానికి ఆ మధ్య ఒక పోస్టర్ అయితే వదిలారు. ఆ ప్రాజెక్టుపై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక చాలా రోజులుగా మరొక దర్శకుడు కూడా మారుతీ తరహాలోనే ప్రభాస్ సినిమా పనులను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు సీతారామం సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి.

ఈ దర్శకుడు పనితనాన్ని మెచ్చి మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో సినిమాను సెట్ చేస్తోంది. కథ అయితే ఎప్పుడో సిద్ధమైంది. ఇక స్క్రిప్ట్ పనులు కూడా చాలా వరకు ఫినిష్ అయ్యాయి. ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఎందుకంటే ప్రస్తుతం లైనప్ లో ఉన్న ప్రభాస్ సినిమాల అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అందుకేనేమో ప్రభాస్ హను సినిమాను సైలెంట్ గానే పట్టాలు ఎక్కించాలని అనుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం హను మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. తన ఆస్థాన సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ తో గోవాలో ప్రస్తుతం ఈ దర్శకుడు ట్యూన్స్ సిద్ధం చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలి అలాగే సాంగ్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయంలో చర్చలు జరపడే కాకుండా ముందుగా కొన్ని ట్యూన్స్ కూడా సిద్ధం చేయిస్తున్నట్లు టాక్.

విశాల్ కు కూడా ఇదొక మంచి అవకాశం గా చెప్పుకోవచ్చు. ఎప్పటినుంచో అగ్ర హీరోల సినిమాలకు వర్క్ చేయాలని చూస్తున్న అతను ఈ సినిమాతో మరొక రేంజ్ కు వెళ్లాలని అనుకుంటున్నాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడది చివర్లో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి తో బిజీగా ఉన్నాడు. అలాగే మారుతి సినిమా కూడా ఫినిష్ కావాల్సి ఉంది. లైనల్ సందీప్ స్పిరిట్ కూడా ఉంది. అయితే స్పిరిట్ కంటే ముందు హను సినిమా స్టార్ట్ కావచ్చని సమాచారం.