Begin typing your search above and press return to search.

హనుమాన్ X డ్రాగన్.. ప్రశాంత్ వర్మ ప్లాన్ వేరే లెవల్!

తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా మరో అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఒక నిప్పులు కక్కే డ్రాగన్ హనుమంతుడు మీదకు దూసుకు వస్తున్నట్టు కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   23 April 2024 11:43 AM GMT
హనుమాన్ X డ్రాగన్.. ప్రశాంత్ వర్మ ప్లాన్ వేరే లెవల్!
X

యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి బరిలో దిగి మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగా సినిమాలతో పోటీపడి విన్నర్ గా నిలిచింది. తాజాగా 100 రోజులు కంప్లీట్ చేసుకుంది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే సీక్వెల్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ప్రశాంత్ వర్మ కూడా సీక్వెల్ ను ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేశారు. అంజనాద్రి 2.0 అంటూ విజువల్స్ ను ఇటీవల షేర్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియన్స్ లో మరింత హైప్ క్రియేట్ చేశారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా మరో అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఒక నిప్పులు కక్కే డ్రాగన్ హనుమంతుడు మీదకు దూసుకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే హనుమంతుడు, డ్రాగన్ మధ్య భీకర యుద్ధం జరగనున్నట్లు అర్థమవుతోంది. ఇక థియేటర్లు దద్ధరిల్లిపోవడం పక్కా అని చెబుతున్నారు నెటిజన్లు.

ఇప్పటి వరకు చైనా సినిమాలకు పరిమితమైన డ్రాగన్‌ కాన్సెప్ట్‌.. ఇప్పుడు భారతీయ చిత్రాల్లో కూడా అలరించనుంది. అంతేకాదు ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో వచ్చే ప్రతి మూవీ కూడా ఐమ్యాక్స్‌ 3డీ వెర్షన్‌ లో తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. విజువల్ వండర్స్ కోసం వెయింటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ సినిమాలో హనుమంతుడు పాత్రలో ఎవరు కనిపిస్తారనే విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. హనుమంతుడి పాత్రను ఒక స్టార్ హీరో పోషిస్తారని ఇప్పటికే ప్రశాంత్ వర్మ తెలిపారు. ఆ మధ్య ఆంజనేయుడు రోల్ కోసం మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి రానా పేర్లను మేకర్స్ పరిశీలించినట్లు టాక్ వినిపించింది. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోల పేర్లను కూడా పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. మరి ఫైనల్ గా ఏ స్టార్ హీరో.. హనుమంతుడిగా కనిపిస్తారో వేచి చూడాలి.