Begin typing your search above and press return to search.

హనుమాన్ విజువల్ ఫీస్ట్.. ఇది అసలు ఉహించలేదు

వీఎఫ్ఎక్స్‌తో పాటు కొన్ని షాట్స్ అయితే మెంటల్ స్టఫ్‌ అని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్‌గా ఉందని చెబుతున్నారు. ప్రశాంత్ వర్మకు నార్త్‌ లో పక్కాగా గుడి కట్టేస్తారని అంటున్నారు

By:  Tupaki Desk   |   12 Jan 2024 3:42 AM GMT
హనుమాన్ విజువల్ ఫీస్ట్.. ఇది అసలు ఉహించలేదు
X

రిలీజ్ కు ఎన్నో అడ్డంకులు.. తక్కువ థియేటర్లు.. చిన్న హీరో అంటూ ట్రోల్స్.. ఇవన్నీ హనుమాన్ జోరుకు బ్రేకులు వెయ్యలేకపోయాయి. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సూపర్ హీరో మూవీ.. బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. జై హనుమాన్ అంటూ థియేటర్లు మార్మోగిపోతున్నాయి. మళ్లీ మళ్లీ ఆ విజువల్ ఫీస్ట్ ను థియేటర్లలోనే చూడాలని సినీ ప్రియులు ఫిక్సయ్యారు. అంతలా ఆకట్టుకుందీ సినిమా.

పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన చిన్న సినిమానే అయినా దేశవ్యాప్తంగా హైప్‌ ను క్రియేట్ చేసుకుంది హనుమాన్. తనదైన డిఫరెంట్ మూవీలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని మేకర్స్ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేశారు.

అయితే ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ చూసిన ఫ్యాన్స్, సినీ ప్రియులు, నటీనటులు సినిమా అద్భుతంగా నెట్టింట చెబుతున్నారు. హనుమంతు పాత్రలో సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ అదరగొట్టేశాడని, మరోసారి ప్రశాంత్ వర్మ తన మార్క్ చూపించారని అంటున్నారు. సూపర్ పవర్స్ వచ్చాక.. హీరో సందడి వేరే లెవల్ లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఎమోషన్స్, డ్రామాతో సినిమా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు.

క్లైమాక్స్ 30 నిమిషాలు చాలు సినిమాను రిపీట్ చేయొచ్చని ట్వీట్లు చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్‌తో పాటు కొన్ని షాట్స్ అయితే మెంటల్ స్టఫ్‌ అని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్‌గా ఉందని చెబుతున్నారు. ప్రశాంత్ వర్మకు నార్త్‌ లో పక్కాగా గుడి కట్టేస్తారని అంటున్నారు. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన సినిమాను ప్రశాంత్ వర్మ అందించారని కొనియాడుతున్నారు.

హనుమాన్ మూవీ ఓ కంప్లీట్ విజువల్ వండర్ అని ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులోని కొన్ని సన్నివేశాలను నెటిజన్లు హైలైట్ చేసి చెప్తున్నారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని మాట్లాడుతున్నారు. హనుమాన్-2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.

హనుమాన్ మూవీ చూసిన కొందరు ప్రభాస్ అభిమానులు.. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ను ట్యాగ్ చేస్తున్నారు. హనుమాన్ మూవీని చూసి ఆదిపురుష్ తీయాల్సిందని ట్రోల్స్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ 25కోట్లతో తో సూపర్ హిట్ అందించిన ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకోవాల్సిందని ట్వీట్లు చేస్తున్నారు.

ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలించింది. ఈ మూవీతో తేజ సజ్జ కెరీర్ దశ తిరగడం పక్కా అన్నమాట.