Begin typing your search above and press return to search.

హనుమాన్.. సెకండ్ డే థియేటర్ల ట్విస్టు

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ కథానాయకుడు తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సినిమానే హనుమాన్.

By:  Tupaki Desk   |   13 Jan 2024 4:26 AM GMT
హనుమాన్.. సెకండ్ డే థియేటర్ల ట్విస్టు
X

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా హనుమాన్ మూవీ గురించే చర్చ నడుస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నిన్న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయింది. రిలీజైన అన్ని సెంటర్లో బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. స్టార్ హీరోల సినిమాలను తొక్కుకుంటూ దూసుకెళ్తోంది. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించనుంది.

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ కథానాయకుడు తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సినిమానే హనుమాన్. ప్రేక్షకుల నుంచి ఈ మూవీ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తేజ యాక్టింగ్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్, విజువల్స్, కథ, క్లైమాక్స్, ఇంటర్వెల్ అదిరిపోయేలా ఉన్నాయంటూ ఆడియెన్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. మళ్లీ మళ్లీ చూడాలని ఉందని చెబుతున్నారు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీకి థియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు అదనపు థియేటర్లు దక్కుతున్నాయి. దీంతో వసూళ్లు కూడా భారీ పెరిగే అవకాశం ఉంది. తొలిరోజు కన్నా రెండో రోజే ఎక్కువ కలెక్షన్లు రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ డే రూ.15కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు ఉండనున్నాయని అంచనా.

మరోవైపు, ఈ సినిమా చూసేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎగబడుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మేకర్స్ కూడా ఎక్స్ ట్రా షోలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే కనుక జరిగితే.. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగే అవకాశం ఉంది.

హనుమాన్ సీక్వెల్‌ కు జై హనుమాన్ గా టైటిల్ ఫిక్స్ చేసి.. 2025లో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించేశారు. హనుమాన్ లో ఓ సామాన్య యువకుడు సూపర్ హీరో ఎలా అయ్యాడు? అనేది కథ. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడు వచ్చి ఏం చేశారనేది సీక్వెల్ స్టోరీ అని ఎండింగ్ చూస్తే అర్థం అవుతోంది.

ఇక ఈ మూవీలో అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. కోలీవుడ్ న‌టుడు విన‌య్ రాయ్ విల‌న్‌గా న‌టించారు. సూప‌ర్ హీరో కావ‌డం కోసం ఏం చేయ‌డానికైనా తెగించే విల‌న్‌గా విన‌య్ రాయ్ యాక్టింగ్ అభిమానుల‌తో ఆక‌ట్టుకుంటోంది. ఈ మూవీలో తేజా స‌జ్జ సోద‌రిగా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషించింది. మరి రానున్న రోజుల్లో.. హనుమాన్ ఎలాంటి రికార్డులు సృష్టించనుందో చూడాలి.