Begin typing your search above and press return to search.

తగ్గేదిలే అంటున్న హనుమాన్!

పెట్టిన బడ్జెట్ రికవరీ కావాలన్నా స్టార్స్ తో పోటీకి దూరంగా ఉండటం ప్రశాంత్ వర్మకి ఉన్న ఛాయస్ అని అందరూ భావించారు. అయితే

By:  Tupaki Desk   |   24 Oct 2023 6:41 AM GMT
తగ్గేదిలే అంటున్న హనుమాన్!
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ వస్తోన్న మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్ కావడం విశేషం. తేజ సజ్జా ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రం తెరకెక్కుతోంది.


షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. హనుమాన్ నుంచి వచ్చిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ వర్మ బియాండ్ లెవల్ కి వెళ్లి ఈ చిత్రంతో ఏదో అద్భుతం చేయబోతున్నాడు అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సంక్రాంతి రేసులోకి పెద్ద సినిమాలు వచ్చి చేరాయి.

గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, సైంధవ్, ఈగల్ లాంటి సినిమాలు రేసులో ఉండటంతో కాంపిటేషన్ టఫ్ గా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో హనుమాన్ సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో కచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ కావాలి. అలాగే తేజ సజ్జా మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పెట్టిన బడ్జెట్ రికవరీ కావాలన్నా స్టార్స్ తో పోటీకి దూరంగా ఉండటం ప్రశాంత్ వర్మకి ఉన్న ఛాయస్ అని అందరూ భావించారు. అయితే రిలీజ్ విషయం మాత్రం వెనక్కి తగ్గేది లే అని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తూ దసరా సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తన శౌర్యాన్ని ప్రదర్శిస్తూ హీరో మీసాలు తిప్పుతూ ఉంటే, అతని కళ్ళజోడులో పది తలల రావణుడి ముంది మాస్క్ పెట్టుకొని విలన్ గా వినయ్ రాయ్ కనిపిస్తున్నాడు. దసరా కానుకగా ఈ ఇంటరెస్టింగ్ పోస్టర్ వదిలారు.

ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటుగా ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజ్ లలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి జనవరి 12ని థియేటర్స్ లోకి రావడం ఖాయం అని పోస్టర్ తో కన్ఫర్మ్ చేసేశారు.