Begin typing your search above and press return to search.

ఎవరొచ్చినా 'హనుమాన్' ధీటుగానే..

అయితే ఇదివరకే ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిన హనుమాన్ నిర్మాతలు ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ గా సమాధానం ఇచ్చేశారు. ఎన్నిసార్లు చెప్పాలి మేము వస్తున్నది సంక్రాంతికే..

By:  Tupaki Desk   |   29 Sep 2023 2:13 PM GMT
ఎవరొచ్చినా హనుమాన్ ధీటుగానే..
X

సలార్ కొత్త రిలీజ్ డేట్ ప్రభావం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పై గట్టిగానే పడుతోంది. ముందుగా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చిన సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు మళ్లీ కొత్త డేట్ కోసం పరుగులు పెట్టాల్సిన సమయం వచ్చింది.ప్ సెప్టెంబర్ లోనే రావాల్సిన సలార్ వివిధ కారణాల వలన డిసెంబర్ కు షిఫ్ట్ కావడం తో ఆ నెలలో రావాల్సిన సినిమాలతో పాటు ఇప్పుడు జనవరిలో విడుదల కావలసిన సినిమాలలో కూడా అలజడి స్టార్ట్ అయ్యింది.

ఎందుకంటే డిసెంబర్ నుంచి జనవరి కి కొన్ని సినిమాలు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో థియేటర్ల సమీకరణ తోపాటు సినిమాల కలెక్షన్స్ పై కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి క్లాష్ లేకుండా వీలైనంతవరకు సంక్రాంతి హడావిడిని తగ్గిస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఇప్పుడు సంక్రాంతి విషయంలో హనుమాన్ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లుగా గత వారం నుంచి మళ్లీ కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ఇదివరకే ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిన హనుమాన్ నిర్మాతలు ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ గా సమాధానం ఇచ్చేశారు. ఎన్నిసార్లు చెప్పాలి మేము వస్తున్నది సంక్రాంతికే.. అందులో ఎలాంటి డౌట్ లేదు అన్నట్లుగా మరొకసారి వివరణ ఇచ్చేశారు. కాబట్టి హనుమాన్ పోటీగా ఎంతమంది ఉన్నా కూడా అసలు తగ్గే అవకాశం లేదు అని అర్థమవుతుంది.

ఎప్పుడో సమ్మర్ కే రావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ ఫైనల్ గా 2024 సంక్రాంతిలో జనవరి 12 అని కరెక్ట్ గా ఫిక్స్ చేసుకుంది. ఇప్పుడు ఇతర సినిమాల నుంచి పోటీ ఎదురయినంత మాత్రాన అసలు ఏమాత్రం వెనుకడుగు వేయలా? అనేలా నిర్మాతలు సీరియస్ గా చెబుతున్నారు. ఈ సినిమాపై అప్పట్లో కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఎక్కువగానే వచ్చాయి.

కానీ వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఎక్కడా కూడా హడావిడి కనిపించలేదు. దర్శకుడు ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇక సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కాబట్టి ప్రమోషన్స్ గట్టిగా చేయాలి. అంతేకాకుండా కంటెంట్ కూడా జనాలకు బలంగా కనెక్ట్ అయితేనే సినిమాకు కలెక్షన్స్ వస్తాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.