Begin typing your search above and press return to search.

హనుమాన్ రఘునందన సాంగ్ రిలీజ్..!

కొన్నాళ్లుగా హనుమాన్ సినిమా చూసిన సినీ ప్రియులందరు ఈ రఘునందన సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా చిత్ర యూనిట్ ఆ సాంగ్ ని రిలీజ్ చేసింది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 8:44 AM GMT
హనుమాన్ రఘునందన సాంగ్ రిలీజ్..!
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా నుంచి రఘునందన సాంగ్ రిలీజైంది. సినిమా లో సర్ ప్రైజింగ్ గా వచ్చిన ఈ సాంగ్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. హనుమాన్ సినిమాలో విభీషణుడు హనుమాన్ గురించి చెప్పే డైలాగ్ టైం లో ఈ సాంగ్ వస్తుంది. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి అద్భుతమైన కంపోజింగ్ అందించగా గేయ రచయిత త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు.

కొన్నాళ్లుగా హనుమాన్ సినిమా చూసిన సినీ ప్రియులందరు ఈ రఘునందన సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా చిత్ర యూనిట్ ఆ సాంగ్ ని రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ను సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర ఈదర, హర్షవర్ధన్ చావలి ఆలపించారు. ఈ సాంగ్ అలా వింటే చాలు ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తాయంటే నమ్మాల్సిందే.

ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా ఈ సాంగ్ అద్భుతాలు చేస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సంక్రాంతి స్టార్ సినిమాల ఫైట్ లో దిగిన హనుమాన్ పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టించింది. సినిమా 300 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. ఆరో వారం వచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ హనుమాన్ సినిమా ఆడుతుంది.

హనుమాన్ సినిమా లో తేజ సజ్జ లీడ్ రోల్ లో నటించగా అమృత అయ్యర్ ఫిమేల్ లీడ్ గా నటించింది. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేసింది. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాను 2025 లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భంగా జై హనుమాన్ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు. జై హనుమాన్ సినిమాలో హనుమాన్ పాత్ర రివీల్ అవుతుంది. అయితే ఈ రోల్ లో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. బాలీవుడ్ హీరో అని కొన్నాళ్లు.. టాలీవుడ్ స్టార్ అని కొద్దిసేపు చెప్పుకుంటున్నారు. అయితే అసలు హనుమాన్ ఎవరన్నది చిత్ర యూనిట్ అఫీషియల్ గా చెప్పాల్సి ఉంది.