Begin typing your search above and press return to search.

హనుమాన్ నిర్మాత.. ఆ హీరో కోసం 50 కోట్లా?

భీష్మ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుములతో రాబిన్ హుడ్, వేణు శ్రీరామ్ తో తమ్ముడు సినిమాలు చేస్తున్నారు నితిన్.

By:  Tupaki Desk   |   28 March 2024 4:30 PM GMT
హనుమాన్ నిర్మాత.. ఆ హీరో కోసం 50 కోట్లా?
X

టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్.. సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వరుసగా మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో డిజాస్టర్లు అందుకున్నారు. నెక్స్ట్ సినిమాలతో ఎలా అయినా గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. తన కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుస చిత్రాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్స్ లో బిజీగా గడుపుతున్నారు.

భీష్మ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుములతో రాబిన్ హుడ్, వేణు శ్రీరామ్ తో తమ్ముడు సినిమాలు చేస్తున్నారు నితిన్. గతకొద్ది రోజులుగా నితిన్ మరో మూవీ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇష్క్ కాంబో మరోసారి రిపీట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నితిన్ మళ్లీ వర్క్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.

ఈ క్రేజీ ప్రాజెక్టును హనుమాన్ మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారట. ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ పై నెట్టింట చర్చ నడుస్తోంది. ఎందుకంటే విక్రమ్ కె కుమార్ థ్యాంక్యూ మూవీ డిజాస్టర్ అయింది. నితిన్ కు కూడా చాలా కాలంగా హిట్ లేదు. దీంతో రూ.50 కోట్లు బడ్జెట్ నిజంగానే పెడుతున్నారా అనే డౌట్ వస్తోంది. నిర్మాత చాలా డేరింగ్ పర్సనే కానీ ఫామ్ లో లేని వారిపై అంతగా రిస్క్ చేస్తారా అనేది అసలు ప్రశ్న.

అయితే నితిన్ - విక్రమ్.. హిట్ కాంబో కాబట్టి చెప్పలేమని అంటున్నారు. ఇటీవల హనుమాన్ తో నిరంజన్ రెడ్డి భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. చిన్న మూవీగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించింది. మేకర్స్ తోపాటు బయర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆయన నెక్స్ట్ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ గతంలో 13B - మనం - 24 లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేశారు. ఇక ఈసారి నితిన్ తో ఇష్క్ లాంటి కథ కాకుండా మరో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు సమాచారం.

ఇక.. నితిన్ ఇటీవల మరో హిట్ డైరెక్టర్ కూడా ఓకే చెప్పారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న 90స్‌ ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ డైరెక్టర్ ఆదిత్య హాసన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్య నితిన్ తో ఆదిత్య హాసన్ చర్చలు జరిపినట్లు కూడా సమాచారం. మరి వరుస సినిమాలతో నితిన్ ఎలా గట్టి కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.