Begin typing your search above and press return to search.

'హనుమాన్' అయోధ్య ఆఫర్.. కిర్రాక్ ఐడియా

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన 'హనుమాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:03 PM GMT
హనుమాన్ అయోధ్య ఆఫర్.. కిర్రాక్ ఐడియా
X

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన 'హనుమాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఇండియన్ సూపర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్కి, తేజ సజ్జ యాక్టింగ్కి ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో థియేటర్స్ అంతా జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి.

'మనిషికి సంకల్పబలం ఉంటే విశ్వంలో ఉన్న అన్ని శక్తులు ఏకమై అతన్ని విజయతీరాలకు చేరుస్తాయి' అనే మాటకి ప్రత్యక్ష నిదర్శనంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్లు గ్రాస్ దాటిన ఈ సినిమా ఇప్పుడు 200 కోట్ల క్లబ్ లో చేరే దిశగా పరుగులు పెడుతోంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాకి అన్ని చోట్ల నుంచి భారీ ప్రేక్షకాదరణ దక్కుతోంది.

ఇదిలా ఉంటే మూవీ టీం రిలీజ్ కి ముందు హనుమాన్ టికెట్‌పై రూ.5 చొప్పున అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించగా తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. హనుమాన్ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ 53,28,211 టికెట్లు అమ్ముడు కాగా.. వాటి ద్వారా వచ్చిన రూ.2,66,41,055 విరాళంగా ఇస్తున్నట్లు ఈరోజు అధికారికంగా వెల్లడించింది.

ఇక రేపు అయోధ్య రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా సినీ ప్రియులకు మల్టీప్లెక్స్ చైన్ మిరాజ్ సినిమాస్ ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది.దాని ప్రకారం జనవరి 22వ తేదీ ఈ సినిమాకు 'బై వన్‌, గెట్‌ వన్.. అంటే ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ ఆఫర్ తో థియేటర్స్ కి జనాలు భారీగా తరలివచ్చే వచ్చే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ ఈ ఆఫర్ ని నార్త్ వాళ్ళు గట్టిగానే వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే హనుమాన్ కి మరిన్ని లాభాలు రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.