Begin typing your search above and press return to search.

హనుమాన్ బిజినెస్.. మంచి బేరమే..

అయితే ప్రశాంత్ వర్మ, నిర్మాత కలిసి చాలా రోజుల నుంచి పక్కా బిజినెస్ స్ట్రాటజీలతో మూవీని మార్కెట్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 5:22 AM GMT
హనుమాన్ బిజినెస్.. మంచి బేరమే..
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా లీడ్ రోల్ లో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హనుమాన్ సినిమాని ఇండియన్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కించారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ప్రశాంత్ వర్మ ఆవిష్కరించారు. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 11 భాషలలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాకి 55 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ప్రమోషన్స్ కి ఓ 5 కోట్ల వరకు వెచ్చించిన మొత్తం 60 కోట్ల ప్రాజెక్ట్ గా హనుమాన్ కనిపిస్తోంది. ఎలాంటి మార్కెట్ లేని ఓ యంగ్ హీరో, అలాగే సాలిడ్ సక్సెస్ లేని ఒక యంగ్ డైరెక్టర్ మీద ఈ స్థాయిలో బడ్జెట్ ని నిర్మాత ఖర్చు పెట్టాడంటే అదంతా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే అని చెప్పాలి.

అయితే ప్రశాంత్ వర్మ, నిర్మాత కలిసి చాలా రోజుల నుంచి పక్కా బిజినెస్ స్ట్రాటజీలతో మూవీని మార్కెట్ చేసుకున్నారు. నాన్ థీయాట్రికల్ రైట్స్ ని జీ5 ఏకంగా 30 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. నిజంగా సినిమాకి చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి. బడ్జెట్ తో సగం నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చేశాయి. ఇక తెలుగులో 20 కోట్ల వరకు ఈ మూవీపైన బిజినెస్ జరిగింది.

ఇతర భాషలలో సినిమాని సొంతగా డిస్టిబ్యూటర్స్ ని పెట్టుకొని రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో మైథాలజీ టచ్ ఉండటంతో నార్త్ ఇండియన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే నాన్ ఇండియన్ లాంగ్వేజ్ లతో పాటు ఇంగ్లీష్ లో కూడా మూవీని ఇంటర్నేషనల్ మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్ కావడంతో రీచ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

నిజంగానే ప్రశాంత్ వర్మ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యి హనుమాన్ కంటెంట్ ఇంటర్నేషనల్ లెవల్ లో ఆడియన్స్ కి రీచ్ అయితే గుంటూరు కారం కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సూపర్ హీరో స్టోరీస్ ని ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటిది ఇండియన్ సూపర్ హీరో మైథాలజీ టచ్ తో హనుమాన్ క్యారెక్టర్ లీడ్ రోల్ లో వస్తుందంటే కచ్చితంగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు .