Begin typing your search above and press return to search.

మగధీర రూట్లోనే హనుమాన్.. వ్వాటే మూమెంట్

తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Feb 2024 9:42 AM GMT
మగధీర రూట్లోనే హనుమాన్.. వ్వాటే మూమెంట్
X

తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 300 కోట్ల వరకు కలెక్షన్స్ ని ఇప్పటి వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ లో హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చిన చిత్రాల జాబితాలో హనుమాన్ మూడో స్థానంలో ఉంది. హనుమాన్ సౌండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.


ఇదలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు హనుమాన్ , మగధీర సినిమాల మధ్య కంపారిజన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, తేజ సజ్జా ల మధ్య కూడా ఒక కామన్ పోలిక వినిపిస్తోంది. వారం చరణ్ కెరియర్ లో చేసిన రెండో మూవీ మగధీర. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. అప్పట్లో హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది.

ఒక్క సినిమా ఇమేజ్ తోనే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీని రామ్ చరణ్ చేశాడు. రాజమౌళి విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు. మగధీరతో రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు హనుమాన్ కూడా తేజా సజ్జాకి హీరోగా మూడో సినిమా మాత్రమే.

ఈ సినిమాకి ముందువరకు హనుమాన్ లో తేజా సజ్జా సూపర్ హీరోగా చేస్తున్నాడంటే చాలా మంది హేళన చేశారు. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరి నోళ్లు మొత్తబడిపోయాయి. ఇండియన్ వైడ్ గా ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. హనుమాన్ తో తేజాకి కూడా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అతని నెక్స్ట్ మూవీ కోసం పీపుల్స్ మీడియా ఏకంగా 40 కోట్లు బడ్జెట్ పెడుతోంది.

దీనిని బట్టి తేజా సజ్జా ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. రామ్ చరణ్ తరహాలోనే, తేజా సజ్జా కూడా ఆరంభంలోనే అద్భుతం చేశాడు. తన ఛరిష్మా, కరిష్మా అమాంతం పెంచుకున్నాడు. ఈ కారణంగానే హనుమాన్, మగధీరల మధ్య ఇప్పుడు ఇంటరెస్టింగ్ పోలిక నడుస్తోంది.