Begin typing your search above and press return to search.

దానికి థియేటర్లు పెరిగాయి.. దీనికి రేట్లు తగ్గాయి

సైంధవ్ సినిమా దాదాపుగా వాష్ అవుట్ అయిపోవడంతో దాని స్క్రీన్లు మిగతా వాటికి కలిసి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 Jan 2024 4:21 AM GMT
దానికి థియేటర్లు పెరిగాయి.. దీనికి రేట్లు తగ్గాయి
X

సంక్రాంతి సినిమాల సందడి మొదలై వారం గడిచిపోయింది. ఈ పండక్కి రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో వేటి ఫలితం ఏంటో ఒక అంచనా వచ్చేసినట్లే. విక్టరీ వెంకటేష్ సినిమా సైంధవ్ పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ అయింది. హనుమాన్ మూవీ ఎవ్వరు ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ రేంజినందుకుంది. డివైడ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది.

తక్కువ అంచనాలతో రిలీజ్ అయిన నా సామిరంగ బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా.. రెండో వారం వేరే సినిమాలు రిలీజ్ చేయకుండా ఖాళీగా వదిలేయడం మామూలే. ఈసారి కూడా అదే జరుగుతుంది. కొత్త సినిమాలు ఏవి రావడం లేదు. ఈవారం కూడా సంక్రాంతి సినిమాలే సందడి చేయబోతున్నాయి. వాటికి కలెక్షన్లు కీలకం కాబోతున్నాయి.

సైంధవ్ సినిమా దాదాపుగా వాష్ అవుట్ అయిపోవడంతో దాని స్క్రీన్లు మిగతా వాటికి కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ అడ్వాంటేజ్ తీసుకుంటున్నది హనుమాన్ మూవీనే. మరోవైపు మహేష్ బాబు సినిమాకు ఆశించిన డిమాండ్ లేకపోవడంతో దాని స్క్రీన్లను తగ్గించి హనుమాన్ కి ఇస్తున్నారు. దీంతో హనుమాన్ తొలి వారానికి దీటుగా వసూళ్లు రాబట్టబోతోంది.

ముఖ్యంగా సెకండ్ వీకెండ్ కలెక్షన్లు కుమ్మేయడం ఖాయం. నాగ్ మూవీ నా సామిరంగకు కూడా స్క్రీన్లు పెరుగుతున్నాయి. ఇక గుంటూరు కారం విషయానికి వస్తే.. ఎక్కువ స్క్రీన్ లో అట్టి పెట్టుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని దానికి కౌంట్ తగ్గించేస్తున్నారు. అలాగే టికెట్లు రేట్లు ఎక్కువ ఉండడం కూడా మైనస్ అవుతోంది. రెండో వారం నుంచి నార్మల్ రేట్లతో సినిమా ఆడబోతోంది.

దీనివల్ల ఆక్యుపెన్సీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. హనుమాన్ ఆల్రెడీ డబుల్ బ్లాక్ బస్టర్ కాగా.. ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లేలా కనిపిస్తోంది. గుంటూరు కారం ఈ వీకెండ్ బాగా ఆడితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా సామిరంగ దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయినట్లే. ఇక వచ్చేవన్నీ లాభాలే అంటున్నారు.