Begin typing your search above and press return to search.

యంగ్ హీరోల‌కు తేజ సజ్జా 'హ‌నుమాన్' బూస్ట్?

ఇటీవ‌లే అంత‌గా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌రిచ‌యం లేని తేజ స‌జ్జా లాంటి తెలుగు యువ‌హీరో `హ‌నుమాన్` చిత్రంతో సాధించిన విజ‌యం అంతే గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది.

By:  Tupaki Desk   |   14 May 2024 3:33 AM GMT
యంగ్ హీరోల‌కు తేజ సజ్జా హ‌నుమాన్ బూస్ట్?
X

బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత మార్పును స్ప‌ష్ఠంగా చూసాం. టాలీవుడ్ ప్ర‌యోగం పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో ఆ త‌ర్వాత హిందీ చిత్ర‌సీమ స‌హా సౌతిండియాలో భారీ ప్ర‌యోగాలు చేసారు. అయితే వీటిలో మెజారిటీ ఫ్లాపులు ఎదురైనా కానీ, కేజీఎఫ్, కాంతార‌, ప‌ఠాన్, యానిమ‌ల్ లాంటి కొన్ని పాన్ ఇండియా బంప‌ర్ హిట్లు ఉత్సాహాన్నిచ్చాయి.

ఇటీవ‌లే అంత‌గా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌రిచ‌యం లేని తేజ స‌జ్జా లాంటి తెలుగు యువ‌హీరో `హ‌నుమాన్` చిత్రంతో సాధించిన విజ‌యం అంతే గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది. తెలుగు ట్యాలెంట్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ ప‌రిమిత బడ్జెట్ చిత్రాన్ని పాన్ ఇండియాలో స‌క్సెస్ చేయ‌డంలో తన ప‌నిత‌నం ఏమిటో చూపించాడు. మంచి కంటెంట్, మేకింగ్ సెన్స్ ఉంటే స్టార్ డ‌మ్ తో ప‌ని లేకుండా విజ‌యం సాధించ‌డం క‌ష్టం కాద‌ని నిరూపించాడు. ఇది చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. ఇటీవ‌ల ప‌లు ప‌రిశ్ర‌మ‌ల్లో హ‌నుమాన్ స్ఫూర్తితో పాన్ ఇండియా సినిమాల్ని ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇరుగుపొరుగు భాష‌ల్లో ప‌లువురు అప్ క‌మ్ హీరోలు కూడా సూప‌ర్ హీరోలుగా న‌టిస్తున్నారంటూ ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తేజ స‌జ్జా హ‌నుమాన్ త‌ర‌హాలో బాలీవుడ్ యువ‌హీరోలు, త‌మిళ హీరోలు కూడా ప్ర‌యోగాల‌ను ప్రారంభించారు. ఇప్పుడు హిందీ చిత్ర‌సీమ‌లో క్రేజీ హీరోగా వెలుగుతున్న కార్తిక్ ఆర్య‌న్ సూప‌ర్ హీరోగా ప్ర‌యోగం చేయ‌బోతున్నాడ‌నేది అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

కార్తీక్ ఆర్యన్.. అంత‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు.. అత‌డి మనోహరమైన వ్యక్తిత్వం.. ఆకర్షణీయమైన చిరునవ్వుతో ప్రేక్షకులను ఆకర్షించి, బాలీవుడ్‌లో ప్రామిస్సింగ్ స్టార్ గా స్థిరపడ్డాడు. అతడు ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో భారీగా అభిమానులను కలిగి ఉన్నాడు. ఇటీవల అత‌డు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో అభిమానులు నెటిజ‌నుల్లో ఉత్సుకతను రేకెత్తించింది. ఈ క్లిప్‌లో కార్తీక్ ఆర్యన్ సూప‌ర్ హీరోయిక్ గా త‌న‌ చుట్టూ ఎర్రటి బ్యాండ్‌లతో డ్ర‌మ‌టిక్ గా కనిపించాడు. ఈ వీడియోతో పాటు క్యాప్షన్‌లో `లోడింగ్` అని రాశాడు. ఈ క్లిప్ చాలా ఊహాగానాలకు దారితీసింది. చాలా మంది అతడి త‌దుప‌రి ప్ర‌య‌త్నం సూపర్ హీరో మూవీ అంటూ ఊహాగానాలు సాగించారు. నెటిజ‌నుల్లో ఒకరు ఇలా రాసారు. ``బ్రహ్మాస్త్ర 2?? క్రిష్ 4? శక్తిమాన్??`` అని వ్యాఖ్యానించ‌గా.. మరొకరు ``రా వన్ పార్ట్ 2 .. ఆ రహా లగ్తా హై!`` అని వ్యాఖ్యానించారు. ``సూపర్ హీరో ఆర్యన్`` అని మరొకరు ఊహించారు. ఒక అభిమాని ``కార్తీక్ సూపర్‌మ్యాన్ ఆర్యన్`` అని కూడా పేర్కొన్నాడు.

ఇటీవల కార్తిక్ ఆర్యన్ ఈ చిత్రంలో ప్రపంచ ఛాంపియన్ సేనా అగ్బెకోతో పోరాడతానని ఇన్ స్టా పోస్ట్ లో ప్రకటించాడు. అతడు ఛాంపియన్ సేనాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో ఆ ఇద్ద‌రూ న‌వ్వుతూ జాలీగా క‌నిపించారు. స్లీవ్ లెస్ షర్ట్ వేసుకున్న కార్తీక్ కండలు మెలితిప్పి కనిపించాడు. అతను క్యాప్షన్‌లో ``రేపు ఈ హ్యాపీ బీస్ట్‌తో పోరాడబోతున్నాను. అసాసినేష‌న్.. అతడు నాపై ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోరాటంలో తన కోపాన్ని వ‌దులుకోడని నేను ఆశిస్తున్నాను`` అని రాసాడు. సేనా అగ్బెకో కార్తీక్ పోస్ట్‌కి ప్రత్యుత్తరం ఇస్తూ, ``హ్యాపీ బీస్ట్ .. దీనిని ఇలానే కొన‌సాగించడానికి ఒక మంచి మార్గం. మీరు మీ సొంత శ‌క్తితో న‌న్ను ఎదుర్కోవ‌డానికి ప్ర‌య‌త్నించండి`` అని రాసారు. కార్తీక్ ఆర్య‌న్ ఈసారి భారీ ప్ర‌యోగం చేయ‌బోతున్నాడ‌ని దీనిని బ‌ట్టి అంద‌రికీ అర్థ‌మైంది. ఈసారి అత‌డు లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌తో అభిమానుల‌ను అల‌రించ‌బోతున్నాడు. కేవ‌లం కార్తీక్ ఆర్య‌న్ మాత్ర‌మే కాదు ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో చాలా మంది హీరోలు హ‌నుమాన్ త‌ర‌హాలో కొత్త కథ‌ల‌తో భారీ ప్ర‌యోగాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. నేటిత‌రం హీరోల భారీ ప్ర‌యోగాలు చూస్తుంటే, భ‌విష్య‌త్ సినిమా ద‌శ దిశ ఎలా మార‌బోతున్నాయో ఊహించ‌గ‌లం. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రం భూల్ భులయ్యా 3 కోసం చిత్రీకరణ‌లో బిజీగా ఉన్నాడు.