Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసులో హనుమాన్ దూకుడు

దీంతో మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఫస్ట్ డే రూ.12 కోట్లు కలెక్షన్లు సాధించిందట.

By:  Tupaki Desk   |   13 Jan 2024 7:45 AM GMT
సంక్రాంతి రేసులో హనుమాన్ దూకుడు
X

ఇండియన్ సినీ థియేటర్స్ అన్ని జై హనుమాన్ నినాదాలతో ఊగిపోతున్నాయి. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్ కు, తేజ సజ్జ యాక్టింగ్ కు థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు ఆడియన్స్.

దీంతో మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఫస్ట్ డే రూ.12 కోట్లు కలెక్షన్లు సాధించిందట. సరైనన్ని థియేటర్స్ దొరకకపోవడం, టికెట్లు రేట్లు పెంచకపోవడం వల్ల సినిమా కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. రానున్న రోజుల్లో హనుమాన్ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

అయితే అత్యధిక థియేటర్లలో మహేశ్ గుంటూరు కారం రిలీజ్ అయినప్పటికీ.. పాజిటివ్ టాక్ తో హనుమాన్ దూసుకుపోతోంది. కాబట్టి గుంటూరు కారం వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. నేడు రిలీజైన వెంకటేశ్ సైంధవ్ మూవీ కూడా మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఇక రేపు నా సామిరంగ సినిమా రిలీజ్ కానుంది. దీంతో హనుమాన్ మూవీ భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

లాంగ్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో వచ్చిన ఈ సినిమాకు నార్త్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన అక్కడి ఆడియన్స్ కూడా ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్ తో ఆ రేంజ్ గ్రాఫిక్స్ ఎలా చేశారో అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు, అమెరికాలోనూ హనుమాన్ హవా కొనసాగుతోంది. ఇప్పుడు మరిన్ని స్క్రీన్లు హనుమాన్ కు దక్కుతున్నాయి. ఇక ఈ మూవీ సీక్వెల్ ను మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు ఫ్యాన్స్. మరి తన సూపర్ హీరో యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించే మిగతా సినిమాలతో ప్రశాంత్ వర్మ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి.