Begin typing your search above and press return to search.

మరికొద్ది గంటల్లో 'హనుమాన్'.. తేజ ఎమోషనల్

ఇక రిలీజ్ కు ముందే స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తే దాదాపు అన్ని షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   11 Jan 2024 12:07 PM GMT
మరికొద్ది గంటల్లో హనుమాన్.. తేజ ఎమోషనల్
X

ఈ సంక్రాంతికి స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమాపై ఉన్న హైప్ అంతా కాదు. పొంగల్ బరిలో నాలుగు సినిమాలు ఉంటే ఆడియన్స్ ఫోకస్ మాత్రం 'హనుమాన్' పైనే ఉంది. జస్ట్ ప్రమోషనల్ కంటెంట్ తోనే ఈ సినిమా ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది.

ఇక రిలీజ్ కు ముందే స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తే దాదాపు అన్ని షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి పెయిడ్ ప్రీమియర్స్ మొదలు కాబోతున్నాయి. కేవలం హైదరాబాదులోనే పెయిడ్ ప్రీమియర్ షోస్ ద్వారా హనుమాన్ కోటికి పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలంగాణలోనే కాదు మిగతా రాష్ట్రాల్లోనూ సినిమాకి భారీ రెస్పాన్స్ లభిస్తోంది.

ఇక సినిమా రిలీజ్ కి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో హీరో తేజ సజ్జా ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర ట్వీట్స్ చేసాడు." హనుమాన్ లోడెడ్ అండ్ డెలివర్డ్.. మరికొన్ని గంటల్లో మీరు ఈ సినిమాని చూడబోతున్నారు. నా రెండున్నర సంవత్సరాల కష్టం, దేశవ్యాప్తంగా ప్రశంసలు, ఎన్నో అడ్డంకులు.. ఇక చివరికి మరో ప్రయాణం ముగింపుకు చేరుకుంది. నా హృదయం మిశ్రమ భావాలతో నిండిపోయింది. ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరిస్తారని, మీ దయగల హృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.. జైశ్రీరామ్.." అని తన ట్వీట్ లో పేర్కొంటూ 'హనుమాన్ జనవరి 12' అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేశాడు.

దీంతో తేజ సజ్జ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక తేజ సజ్జా విషయానికొస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని అద్భుతం, ఇష్క్, ఓ బేబీ, జాంబిరెడ్డి వంటి సినిమాలతో హీరోగా వరుస విజయాలు అందుకున్నాడు. ఇక ఈసారి 'హనుమాన్' తో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ పైనే కన్నేశాడు. సినిమాకి ఆడియన్స్ లో ఉన్న హైప్ చూస్తుంటే హనుమాన్ తో తేజ సజ్జా యంగ్ హీరోలలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం పక్కాగా కనిపిస్తోంది.

ఈ సినిమా కనుక సక్సెస్ అయితే ఇతనితో స్టార్ డైరెక్టర్స్ సైతం సినిమాలు చేసే అవకాశం ఉందని సందేహంగా చెప్పవచ్చు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శీను కీలకపాత్రలు పోషించారు.