Begin typing your search above and press return to search.

హనుమాన్ హిందీ ఎలా కనెక్ట్‌ అయ్యింది?

హనుమాన్ సినిమాలోని కొన్ని డైలాగ్స్ మరియు సన్నివేశాలకు హిందీ ప్రేక్షకులు బాగా ఆకర్షితులు అవుతున్నట్లుగా అక్కడి మీడియా లో కథనాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Jan 2024 9:00 AM GMT
హనుమాన్ హిందీ ఎలా కనెక్ట్‌ అయ్యింది?
X

మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి మరీ హనుమాన్ సినిమా మంచి వసూళ్లు నమోదు చేస్తున్నట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో హనుమాన్ హవా కొనసాగుతోంది.

మొదటి తెలుగు సూపర్ మాన్ సినిమా అంటూ చేసిన ప్రచారం బాగా కలిసి వచ్చింది. టాలీవుడ్‌ ప్రేక్షకులు హనుమాన్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక హిందీ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్‌ దక్కింది. హిందీలో ఈ సినిమా కనెక్ట్‌ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో మన సౌత్‌ సినిమాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ఉత్తర భారతంలో సూపర్‌ హిట్ అయ్యాయి. కార్తికేయ 2 ఎలా అయితే మంచి విజయాన్ని సొంతం చేసుకుందో అలాగే హనుమాన్ సినిమా కూడా అక్కడి ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యింది.

హనుమాన్ సినిమాలోని కొన్ని డైలాగ్స్ మరియు సన్నివేశాలకు హిందీ ప్రేక్షకులు బాగా ఆకర్షితులు అవుతున్నట్లుగా అక్కడి మీడియా లో కథనాలు వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చూపించిన సన్నివేశాలకు హిందీ ప్రేక్షకులు తెగ ఫిదా అవుతున్నారట.

తేజ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్‌ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం అన్నట్లుగా మొదటి నుంచి కొందరు విశ్వాసం వ్యక్తం చేస్తూ వచ్చారు. సంక్రాంతి సెలవులు కలిసి వచ్చి కచ్చితంగా హనుమాన్‌ వంద కోట్ల క్లబ్‌ లో చేరడం మాత్రమే కాకుండా అంతకు మించి అరుదైన రికార్డులను కూడా నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.