Begin typing your search above and press return to search.

అయోధ్య కోసం హనుమాన్ టీమ్ ఎంత కలెక్ట్ చేసింది అంటే?

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ సినిమాకి 53,28,211 టిక్కెట్లు బుక్ కాగా అందులోంచే 2,66,41,055 విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:17 AM GMT
అయోధ్య కోసం హనుమాన్ టీమ్ ఎంత కలెక్ట్ చేసింది అంటే?
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ హనుమాన్. ఈ మూవీ ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూళ్లని సొంతం చేసుకుంది. సూపర్ హీరో కథతో వచ్చిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు హనుమాన్ సినిమాకి బుక్ అయిన ప్రతి టికెట్ పై ఐదు రూపాయిలు అయోధ్య రాముడికి విరాళంగా ఇవ్వబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు.


ఇదిలా ఉంటే తాజాగా ఇప్పటి వరకు బుకింగ్స్ ద్వారా వచ్చిన డబ్బు నుంచి అయోధ్య రామాలయానికి ఇవ్వబోయే విరాళాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ సినిమాకి 53,28,211 టిక్కెట్లు బుక్ కాగా అందులోంచే 2,66,41,055 విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విరాళం అయోధ్య రామమందిరానికి పంపిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే ప్రీమియర్స్ షో ద్వారా విక్రయించిన 2,97,162 టిక్కెట్లలో 14,85,810 చెక్కును ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి అద్భుతమైన ఆదరణ లభించింది అని చెప్పడానికి చిత్ర నిర్మాత ప్రకటించిన ఈ విరాళమే సాక్ష్యం. ఇకపై వచ్చే కలెక్షన్స్ లో కూడా ఫైనల్ గా వచ్చిన మొత్తం నుంచి 5 రూపాయిలు రామ మందిరానికి పంపించనున్నారంట.

ఓ విధంగా అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరగడం హనుమాన్ మూవీ రిలీజ్ కావడం ఒకే నెలలో కావడంతో ఆ బజ్ కూడా సినిమాకి బాగా కలిసొచ్చింది. చిత్ర యూనిట్ ప్రకటించిన ఐదు రూపాయిల విరాళం నార్త్ ఇండియాలో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దానికి తోడు అద్భుతమైన కంటెంట్ ఉండటంతో మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది.

లాంగ్ రన్ లో ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ లో ఇప్పటికే హనుమాన్ కలెక్షన్స్ పరంగా టాప్ 5 లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియాలో కూడా కార్తికేయ2 తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాగా హనుమాన్ నిలిచింది.