Begin typing your search above and press return to search.

హనుమాన్ మరో డాలర్ రికార్డ్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది

By:  Tupaki Desk   |   28 Jan 2024 7:42 AM GMT
హనుమాన్ మరో డాలర్ రికార్డ్
X

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. సంక్రాంతి రేసులో పెద్దల సినిమాల మధ్య వచ్చిన, పోటీని తట్టుకొని మరి ఈ మూవీ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ మూవీ 250 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో కూడా చిన్న సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.

ఓ విధంగా సినిమా ట్రెండ్ సెట్ చేస్తోందని చెప్పాలి. పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేకపోయిన కంటెంట్ లో దమ్ముంటే ఏ మూవీకి అయిన ప్రేక్షకులు పట్టం కడతారని హనుమాన్ ప్రూవ్ చేసింది. తేజా సజ్జా ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ యాక్టర్ గా మారిపోయాడు. ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అనే ఇమేజ్ తెచ్చుకున్నాడు.

ఇక ఈ మూవీ ఓవర్సీస్ లో ఇప్పటికే 6 మిలియన్ డాలర్లుకి పైగా వసూళ్లు సాధించింది. ఒక్క ఉత్తర అమెరికాలోనే ఏకంగా 5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని సాధించడం ద్వారా హనుమాన్ అరుదైన ఫీట్ అందుకుంది. రాజమౌళి సినిమాలైనా బాహుబలి2, ఆర్ఆర్ఆర్ తర్వాత ఉత్తర అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాగా హనుమాన్ నిలిచింది.

నిజానికి ఉత్తర అమెరికాలో ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్స్ మాత్రమే ఉత్తర అమెరికాలో 2, 3 మిలియన్ డాలర్ల క్లబ్ లో ఉన్నారు. వీరి చిత్రాలకి మాత్రమే ఆ స్థాయిలో కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. అయితే హనుమాన్ విషయంలో మాత్రం అక్కడి ప్రేక్షకులు స్టార్ క్యాస్టింగ్ ని అస్సలు చూడలేదు. హనుమాన్ అనే పేరు సినిమాకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది.

దానికి తగ్గట్లుగానే విజువలైజేషన్, కంటెంట్ కూడా బాగా కనెక్ట్ కావడంతో లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ లో కొనసాగుతోంది. చిన్న సినిమాగా వచ్చి 5 మిలియన్స్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ని ఉత్తర అమెరికాలో వసూళ్లు చేసిన మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా తీసుకొచ్చిన ఊపుతో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కి ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది.