Begin typing your search above and press return to search.

హనుమాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

ఓవరాల్ గా 26.65 కోట్ల బిజినెస్ హనుమాన్ సినిమాపై జరిగింది. 27.50 కోట్ల షేర్ వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించినట్లే.

By:  Tupaki Desk   |   11 Jan 2024 4:24 AM GMT
హనుమాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్  ఎంతంటే?
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ మూవీ జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా 11 భాషలలో రిలీజ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

గుంటూరు కారం, సైంధవ్ తర్వాత అత్యధిక బిజినెస్ ఈ చిత్రానికే జరిగింది. కేవలం కంటెంట్ మీద నమ్మకంతోనే డిస్టిబ్యూటర్స్ ఈ సినిమా రైట్స్ ని కొన్నారు. ప్రశాంత్ వర్మ టీం డిఫరెంట్ స్ట్రాటజీతో మూవీని మార్కెట్ చేస్తోంది. వారి ఫోకస్ అంతా కూడా నార్త్ ఇండియాపైనే ఉంది. దీనికి కారణం ఇలాంటి ఆధ్యాత్మిక కోణం ఉన్న కథలకి నార్త్ లో ఆదరణ ఉండటమే.

ఇక హనుమాన్ సినిమా బిజినెస్ డీటెయిల్స్ చూసుకుంటే నైజాంలో 7.15 కోట్లకి డీల్ సెట్ అయ్యింది. సీడెడ్ లో 4 కోట్ల బిజినెస్ జరిగింది. ఆంధ్రాలో 9.50 కోట్లకి రైట్స్ అమ్ముడయ్యాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల బిజినెస్ 20.65 కోట్లు ఉంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 2 కోట్ల వ్యాపారం మాత్రమే అయ్యింది. ఓవర్సీస్ లో 4 కోట్లకి రైట్స్ సేల్ అయ్యాయి.

ఓవరాల్ గా 26.65 కోట్ల బిజినెస్ హనుమాన్ సినిమాపై జరిగింది. 27.50 కోట్ల షేర్ వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించినట్లే. ప్రస్తుతం మూవీ మీద మంచి పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ గట్టిగానే వస్తాయి. తరువాత లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ స్థాయిలో విజయం అందుకుంటుంది అనేది మౌత్ టాక్ బట్టి ఉంటుంది.

చిత్ర యూనిట్ మాత్రం హనుమాన్ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. కచ్చితంగా తమ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అని అంటున్నారు. హనుమాన్ అనే సెంటిమెంట్ తమ సినిమాని నిలబెడుతుందని భావిస్తున్నారు.