Begin typing your search above and press return to search.

అక్కడ 'గుంటూరు కారం' ను వెనక్కి నెట్టిన 'హనుమాన్'!

'హనుమాన్' సినిమాకి ఏకంగా 169.5K(అంటే లక్ష అరవై తొమ్మిది వేలకు పైగా) మంది ఇంట్రెస్ట్ ని చూపించారు. తర్వాత 'గుంటూరు కారం' 168.7K(లక్ష అరవై ఎనిమిది వేలకు పైగా) మందితో రెండో స్థానంలో ఉంది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 5:27 PM GMT
అక్కడ గుంటూరు కారం ను వెనక్కి నెట్టిన హనుమాన్!
X

టాలీవుడ్ బాక్సాఫీస్ వల్ల ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. వీటన్నింటిలో ఇప్పటివరకు చూసుకుంటే మహేష్ 'గుంటూరు కారం' సినిమాపై భారీ హైప్ ఉంది. కానీ ప్రముఖ ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షో లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ ప్రకారం 'హనుమాన్' సినిమా ముందస్తు స్థానంలో ఉంది.

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల లిస్టులో బుక్ మై షో లో 'హనుమాన్' హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ని కలిగి ఉంది. ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ లో 'హనుమాన్' సినిమాకి ఏకంగా 169.5K(అంటే లక్ష అరవై తొమ్మిది వేలకు పైగా) మంది ఇంట్రెస్ట్ ని చూపించారు. తర్వాత 'గుంటూరు కారం' 168.7K(లక్ష అరవై ఎనిమిది వేలకు పైగా) మందితో రెండో స్థానంలో ఉంది.

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా హనుమాన్ లాంటి చిన్న సినిమాతో వెనుకంజలో ఉందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తోంది. ఇక సంక్రాంతి సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటించిన 'సైంధవ' సినిమా కోసం 63K(అరవై మూడు వేలు) మంది ఇంట్రెస్ట్ చూపించగా నాగార్జున 'నా సామిరంగా' కోసం 41K(నలభై ఒక వెయ్యి) మంది ఆసక్తి చూపగా.. రవితేజ ఈగల్ 18.2K(పద్దెనిమిది వేలకు పైగా) మందితో చివరి స్థానంలో ఉంది.

ఈ లెక్కలు బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ పై ఎలాంటి ప్రభావం చూపించవు. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు అన్నింటిలో 'గుంటూరు కారం' సినిమానే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుంది. అయితే సంక్రాంతికి విడుదల అయ్యే అన్ని సినిమాల్లో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కలయికలో తెరకెక్కిన 'హనుమాన్' పై ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని చూపించడం విశేషం. ఎందుకంటే ఈ సినిమా ఇండియన్ సూపర్ హీరో అనే కాన్సెప్ట్ తో వస్తోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నింటికీ భారీ స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ట్రైలర్లో గ్రాఫిక్స్, VFX టెక్నీకాలిటీ పరంగానూ మూవీ టీమ్ నుంచి బ్రిలియంట్ వర్క్ కనిపించింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉంటుందని మేకర్స్ ముందు నుంచే చెబుతూ వస్తున్నారు. అవుట్ పుట్ కూడా అదే రేంజ్ లో ఉండడంతో ఆడియన్స్ అందరూ ఈ సినిమాపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అటు మూవీ టీం కూడా కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెంట్ తోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాతో పోటీపడి మరి జనవరి 12న సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.