Begin typing your search above and press return to search.

హనుమాన్ @250.. ఇది మరో బిగెస్ట్ బోనస్

కానీ సినిమా ప్రతి వీకెండ్ లోను హాలిడేస్ ను ఉపయోగించుకుంది. దీంతో ఇప్పుడు ఆ లెక్క 250 కోట్లకు చేరడం విశేషం. సంక్రాంతి నుంచి హనుమాన్ హడావిడి ఏమాత్రం తగ్గడం లేదు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 8:38 AM GMT
హనుమాన్ @250.. ఇది మరో బిగెస్ట్ బోనస్
X

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరపైకి తీసుకువచ్చిన ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా సంక్రాంతి పోటీలో తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ లో కూడా హనుమాన్ సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి.


ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకొక రికార్డును అందుకోవడం విశేషం. ఇప్పటికే ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని సినిమా ఊహించని స్థాయిలో ప్రాఫిట్స్ అందించింది అని కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమా ప్రతి వారంలో కూడా ఒక మైలురాయిని దాటుతోంది. ఫ్యాన్ ఇండియా హీరోలు సాధించే రేంజ్ లో తేజ కెరీర్లో అలాంటి రికార్డులు నమోదు అవుతూ ఉండడం విశేషం.

ఇంతకుముందు తేజ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ సినీ కెరియర్ లో కనీసం 25 కోట్ల మార్కు కూడా అందుకోలేదు. అలాంటిది ఇప్పుడు హనుమాన్ సినిమా మాత్రం ఈజీగా 100 కోట్లను దాటుకొనీ ప్రతివారం అంతకు మించిన స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ ఉండడం విశేషం. ఇక ఈ సినిమా 200 కోట్లు రేంజ్ లోనే ఆగిపోతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ సినిమా ప్రతి వీకెండ్ లోను హాలిడేస్ ను ఉపయోగించుకుంది. దీంతో ఇప్పుడు ఆ లెక్క 250 కోట్లకు చేరడం విశేషం. సంక్రాంతి నుంచి హనుమాన్ హడావిడి ఏమాత్రం తగ్గడం లేదు. ఇక రిపబ్లిక్ డే హాలిడేస్ ను కూడా ఈ సినిమా చాలా చక్కగా యూస్ చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్ కూడా మంచి నెంబర్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి.

ఈ సినిమా ఓవరాల్ గా చేసిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే 29 కోట్లు మాత్రమే. ఇక 30 కోట్ల టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అనుకున్నారు. కానీ సినిమా ఊహించని విధంగా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రాఫిట్ అందిస్తూ ఉండడం విశేషం. ఇక హనుమాన్ పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే 100 కోట్లకు రేంజ్ లో ప్రాఫిట్ అందించింది. అంటే ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హనుమాన్ 15 రోజుల షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి

ఏపీ తెలంగాణ - 73.37 కోట్లు

కర్ణాటక - 10.75 కోట్లు

హిందీ+ రెస్ట్ ఆఫ్ ఇండియా; 20.75 కోట్లు

ఓవర్సీస్ : 25.55 కోట్లు

వరల్డ్ వైడ్: 130 కోట్లు షేర్, గ్రాస్ 250 కోట్లు