ప్రభాస్ తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉంది ఎవరు..?
ఆల్రెడీ దుల్కర్ హను కథ చెబితే చాలు ఎలాంటి డౌట్స్ లేకుండా ఓకే చేసేలా ఉన్నాడు.
By: Tupaki Desk | 30 April 2025 4:30 PMసీతారామం తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి క్రేజ్ పెరిగింది. ఆ సినిమా ఆయన డీల్ చేసిన విధానం అతనికి ఉన్న సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ని దాటి సినిమా సక్సెస్ చేసుకోవడంతో ఆ సినిమా వెంటనే ప్రభాస్ తో ఛాన్స్ వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ తో ఫౌజీ సినిమా చేస్తున్న హను రాఘవపూడి ఈ సినిమాను ఎలాగైనా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో స్పీడ్ గా కానిస్తున్నాడు. ప్రభాస్ సినిమా అంటే చాలు రెండు మూడేళ్లు పడుతుందని అనుకునే వారికి ఫౌజీని త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఫౌజీ ని నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే హను ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడా అన్న చర్చ మొదలైంది. ఐతే ఆల్రెడీ హను తను తీయబోయే నెక్స్ట్ సినిమా కథ కూడా రెడీ చేసుకున్నాడని టాక్. అంతేకాదు తనకు సూపర్ హిట్ ఇచ్చిన హీరోతోనే ఆ సినిమా చేస్తాడని అంటున్నారు. సీతారామంతో సూపర్ హిట్ ఇచ్చిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తోనే హను నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
ఆల్రెడీ దుల్కర్ హను కథ చెబితే చాలు ఎలాంటి డౌట్స్ లేకుండా ఓకే చేసేలా ఉన్నాడు. లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ కొట్టిన దుల్కర్ ప్రస్తుతం కాంత సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తి చేశాక హను తో సినిమా ఉండే ఛాన్స్ ఉందట. ఐతే ఈసారి దుల్కర్ తో వార్ బ్యాక్ డ్రాప్ కాకుండా వెరైటీ కథతో రాబోతున్నాడట హను రాఘవపూడి.
ఎందుకు హను దుల్కర్ తో చేస్తున్నాడు మన దగ్గర హీరోలు లేరా అంటే సీతారామం కథ కూడా దుల్కర్ ని అప్రోచ్ అవ్వడానికి ముందు మన దగ్గర హీరోకి చెప్పడం అతను రిజెక్ట్ చేసిన తర్వాతే ఇక ఎవరు వద్దు దుల్కర్ తోనే చేస్తానని హను ఫిక్స్ అవ్వడం జరిగింది. హను నమ్మకానికి తగినట్టుగానే దుల్కర్ తో చేసిన సీతారామం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాతో మృణాల్ ఠాకూర్ కూడా టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిది. మరి ఫౌజీ తర్వాత హను చేస్తున్న సినిమాలో దుల్కర్ హీరో అయితే మళ్లీ హీరోయిన్ గా మృణాల్ నే రిపీట్ చేస్తారా వేరే హీరోయిన్ ని తీసుకుంటారా అన్నది చూడాలి.