Begin typing your search above and press return to search.

34 నిమిషాల షాట్ సింగిల్ టేక్ లో!

ఆపిల్ బ్యూటీ హ‌న్సిక కొంత కాలంగా సోలో ప్ర‌య‌త్నాలు జోరుగా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు ఎక్కువ‌గా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తోనే ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 1:30 PM GMT
34 నిమిషాల షాట్ సింగిల్ టేక్ లో!
X

ఆపిల్ బ్యూటీ హ‌న్సిక కొంత కాలంగా సోలో ప్ర‌య‌త్నాలు జోరుగా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు ఎక్కువ‌గా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తోనే ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. ఈ విష‌యంలో మాత్రం హ‌న్సిక జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు కేవ‌లం ఆమెని మాత్ర‌మే బేస్ చేసుకుని సినిమాలు తీస్తున్నారు. వ‌చ్చిన అవ‌కాశాల్ని అమ్మ‌డు తెలివిగా స‌ద్విన‌యోగం చేసుకుం టుంది.

స్టార్ హీరోల‌తో ఆఫ‌ర్లు కూడా త‌గ్గిన నేప‌థ్యంలో ఈ ర‌క‌మైన ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. తెలుగులోనూ వాటిని అనువాద రూపంలో రిలీజ్ అయ్యేలా చూసుకుంటుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు `105 మినిట్స్` అనే సినిమాలో న‌టిస్తోంది. హ‌న్సిక మెయిన్ లీడ్ లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. రాజు దుస్సా అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌లే ఈసినిమా ప్ర‌చార చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి.

వాటితో సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమా కోసం హ‌న్సిక బాగానే క‌ష్ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. 34 నిమిషాల ఒక షాట్ ని కేవ‌లం సింగిల్ టేక్ లోనూ లాక్ చేసింది. అందుకోసం అమ్మ‌డు ఏకంగా 8 రోజుల పాటు ప్ర‌త్యేకంగా రిహార్స‌ల్స్ చేసిందిట‌. సింగిల్ టేక్ లో షాట్ ఒకే అయిందంటే? దాని వెనుక తానెంత క‌ష్ట‌ప‌డింద‌న్న‌ది రివీల్ చేసింది. ఇలాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేయ‌డం నా కెరీర్ కి రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. మంచి పాత్ర‌లు వ‌స్తే ఎంత‌క‌ష్ట‌మైనా ప‌డొచ్చు. 34 నిమిషాల స‌న్నివేశం నాకెప్పుడు ఎదుర‌వ్వ‌లేదు. ఇది నాకు కొత్త ర‌క‌మైన అనుభ‌వాన్ని ఇచ్చింది. ఇలాంటి ప్ర‌యో గాలు సినిమాలో మ‌రెన్నో ఉంటాయి. సామ్ సిఎస్ సంగీతం సినిమాకి ప్ర‌త్యేక పాత్ర‌గా క‌నిపిస్తుంది` అని తెలిపింది. ఈ సినిమాతో రాజు దుస్సా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి అనుభ‌వం లేక‌పోయినా హ‌న్సిక కంటెంట్ నమ్మి అవ‌కాశం ఇచ్చింది.