Begin typing your search above and press return to search.

ట‌ర్కీ క్రూయిజ్ షిప్‌లో హ‌న్సిక చిలౌట్ పార్టీ వైర‌ల్

ఆపిల్ బ్యూటీ హ‌న్సిక ఇటీవ‌లే దుబాయ్ కి చెందిన బిజినెస్‌మేన్ సోహెల్ ఖ‌తురియాను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Aug 2023 5:02 AM GMT
ట‌ర్కీ క్రూయిజ్ షిప్‌లో హ‌న్సిక చిలౌట్ పార్టీ వైర‌ల్
X

ఆపిల్ బ్యూటీ హ‌న్సిక ఇటీవ‌లే దుబాయ్ కి చెందిన బిజినెస్‌మేన్ సోహెల్ ఖ‌తురియాను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి అనంత‌రం త‌మ మ‌ధ్య అనుబంధం ప్రేమాయ‌ణం గురించి హ‌న్సిక ఓ డాక్యు సిరీస్ లో వెల్ల‌డించింది. త‌న‌పై ఎన్నో పుకార్లు ఉన్నా.. వాట‌న్నిటికీ స‌మాధాన‌మిచ్చే ప్ర‌య‌త్నం చేసింది హ‌న్సిక‌. అదంతా అటుంచితే స్నేహితుడు ఖ‌తురియాతో వివాహంలో అన్నిర‌కాలుగా సంసార స‌రిగ‌మ‌ల్ని ఆస్వాధిస్తోంది ఆపిల్ బ్యూటీ.

10 ఆగ‌స్ట్ 2023న హన్సిక మోత్వానీ తన 32వ పుట్టినరోజును తన భర్త సోహెల్ ఖతురియాతో కలిసి టర్కీలోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాల న‌డుమ‌ విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో జ‌రుపుకుంది. ఈ వేడుక‌లో భ‌ర్త‌తో క‌లిసి ఎంతో ఆసందంగా క‌నిపించింది హ‌న్సిక‌. క్రూయిజ్ షిప్ లో హ‌న్సిక షాంపైన్ సేవిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. హ‌నీ ఆకర్షణకు త‌గ్గ‌ట్టుగానే ఆమె భర్త సోహెల్ ఖతురియా డిజైన‌ర్ లుక్ లో క‌నిపించారు.

హన్సిక మోత్వాని చివ‌రిగా సందీప్ కిషన్ స‌ర‌స‌న 'తెనాలి రామకృష్ణ BA' లో న‌టించింది. ఆ సినిమా ఆశించిన విజ‌యాన్ని ద‌క్కించుకోలేదు. అంత‌కుముందు మంచు కాంపౌండ్ నాయిక‌గాను ఆశించిన విజ‌యాల్ని అందుకోవ‌డంలో త‌డ‌బ‌డింది. త‌దుప‌రి త‌మిళంలో వ‌రుస చిత్రాల‌తో బిజీ అయింది. ఇంత‌లోనే సోహెల్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు కొంత విరామ‌మిచ్చిన హ‌న్సిక త‌దుప‌రి కెరీర్ పై ఫోక‌స్ చేయ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతానికి హ‌న్సిక క్రూయిజ్ షిప్ విహారం, భ‌ర్త‌తో రొమాంటిక్ డేట్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి.