హన్సిక ఇకపై వాటికే పరిమితమా?
ఇప్పటికే తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఆత్మ పగా ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు.
By: Tupaki Desk | 24 April 2025 8:00 PM ISTవైట్ బ్యూటీ హన్సిక గత కొంత కాలంగా హారర్ థ్రిల్లర్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం అవుతూ వస్తోంది. 'దేశముదురు'తో తెలుగులో మెరిసి స్టార్ హీరోలతో కలిసి నటించి తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఆ క్రేజ్‌క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చింది. 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' తరువాత తెలుగులో కనిపించకుండా పోయిన హన్సిక తమిళ తెరకు పరిమతమైపోయింది.
అక్కడి సినిమాల్లో నటిస్తూ హీరర్ థ్రిల్లర్‌లు, హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ వస్తోంది. సబరి, గురు సరవనన్ దర్శకత్వంలో హన్పిక నటించిన హారర్ థ్రిల్లర్ 'గార్డియన్'. గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ మూవీ ఏడాది తరువాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోకి వచ్చేసింది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహలో హన్సిక 'గార్డియన్' స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పటికే తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఆత్మ పగా ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. కొదరి కారణంగా ఆత్మ హత్యకు గురైన ఓ యువతి తన చావుకి కారణమైన వారిపై పగతీర్చుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఆ ఆత్మకు హీరో,హీరోయిన్‌లు సహాయం చేస్తారు.
అయమితే ఆ యువతి ఎవరు? తనకు జరిగిన అన్యాయం ఏంటీ?.. ఆత్మగా మారిన సదరు యువతి తన చావుకి కారణమైన వారిపై ఎలా ప్రగతీర్చుకుంది అన్నదే 'గార్డియన్' మూవీలో ప్రధాన కథ. హన్సిక నటన, సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయట.
