మార్కో తో రాజుగారు హీరోల మధ్య బిగ్ ఫైట్!
మాలీవుడ్ యువ సంచలనం `మార్కో` ఫేం హనీఫ్ అదేని టాలీవుడ్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియే షన్స్ లాక్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 April 2025 12:30 PMమాలీవుడ్ యువ సంచలనం `మార్కో` ఫేం హనీఫ్ అదేని టాలీవుడ్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియే షన్స్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. `మార్కో` పాన్ ఇండియాలో సాధించిన విజయం చూసి దిల్ రాజు మరో ఆలోచన లేకుండా? ప్యూచర్ స్టార్ డైరెక్టర్ గా విశ్వసించి హనీఫ్ కి అడిగితనంత అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసాడు. హనీఫ్ తో దిల్ రాజు పాన్ ఇండియాలో ఓ సంచలన చిత్రం చేస్తాడు? అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అతడి పాన్ ఇండియా ఇమేజ్..మేకింగ్ నచ్చి బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే అందులో హీరో ఎవరు? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. డైరెక్టర్ ని లాక్ చేస్తే ఎప్పుడైనా సినిమా తీయోచ్చు! అన్న ఆలోచనతో నిర్మాతలు అడ్వాన్సులు ఇవ్వడం సహజం. కానీ రాజుగారు అడ్వాన్స్ ఇవ్వడం వేరు. ఈయన పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత సినిమా తీసే నిర్మాత కాదు.
ఫాంలో ఉండగానే పట్టాలెక్కించే డైరెక్టర్. ఈ నేపథ్యంలో ఏ హీరోకి ఆ ఛాన్స్ ఉంటుందని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాజుగారు మైండ్ లో ఇద్దరు హీరోలున్నట్లు లీకైంది. అక్కినేని వారసుడు అఖిల్ ఒకరు కాగా....యంగ్ హీరో శర్వానంద్ మరొకరుగా వినిపిస్తుంది. ఇద్దరిలో ఎవరో ఒకరితో ఈ సినిమా తీయాలని ఆలోచన చేస్తున్నారుట. అయితే హనీఫ్ ఈసారి ఎలాంటి స్టోరీ నేపథ్యాన్ని తీసుకుంటాడు? అన్నది అతడి మీద ఆధారపడి ఉంటుంది.
మార్కో క్రైమ్ థ్రిల్లర్. ఇండియాలో ఇంతవరకూ ఏ డైరెక్టర్ అంత రా తరహా క్రైమ్ ని తెరపై ఆవిష్క రించలేదు. ఆ రకంగా హనీఫ్ ని న్యూఏజ్ మేకర్ గా చెప్పాలి. ఒకవేళ అదే అంశాన్ని ఎంచుకుంటే? హీరో కూడా అంతే కీలకం. క్రైమ్ స్టోరీల్లో ఇప్పటికే శర్వానంద్ కనిపించాడు. సత్య-2, ప్రస్తానం లాంటి సినిమాలు సినిమా శర్వాకి ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్రాలే. ఆ పాత్రలకు అన్ని రకాలుగా అర్హుడు శర్వా.
అలాగని అఖిల్ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంతవరకూ అఖిల్ క్రైమ్ నేపథ్యం సినిమాలు చేయలేదు. కానీ క్రైమ్ కథలకు పక్కాగా యాప్ట్ అయ్యే నటుడు అఖిల్. అతడి కటౌట్ ..వాయిస్ లో బేస్ అన్నీ క్రైమ్ స్టోరీలకు బాగా మ్యాచ్ అవుతాయి. మరి ఈ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ ఎవరికొస్తుందో చూడాలి.