Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప‌చ్చ కోక‌లో హంస హొయ‌లు

ఇక‌ సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న హంసానందిని రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 5:11 PM GMT
ఫోటో స్టోరి: ప‌చ్చ కోక‌లో హంస హొయ‌లు
X

జ‌గ‌ప‌తిబాబు స‌హా ప‌రిశ్ర‌మ టాప్ హీరోల స‌ర‌స‌న నటించిన హంసానందిని ఊహించ‌ని కొన్ని కార‌ణాల‌తో ప‌రిశ్ర‌మ నుంచి దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో క్యాన్స‌ర్ కి చికిత్స పొంది కోలుకున్నాన‌ని ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత ట్రావెల్ బ్లాగ‌ర్ గా త‌న జ‌ర్నీని సాగిస్తున్న‌ట్టు తెలిపింది. ఇక నిరంత‌రం కుకింగ్ వీడియోల‌తో ఆదాయ ఆర్జ‌న సాగిస్తూ కాలం గ‌డిపింది. ఇప్ప‌టికీ యూట్యూబర్ గా రాణిస్తున్న హంసాకు ఆదాయ ప‌ర‌మైన స‌మ‌స్య లేదు.


ఇక‌ సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న హంసానందిని రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. కేర‌ళ- మున్నార్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా హంస ప‌లు స్టోరీస్ కూడా చేసింది. స్వాన్ స్టోరీస్ పేరుతో ఈ అమ్మ‌డు ఇటీవ‌ల ప్ర‌తిదీ అభిమానుల‌కు షేర్ చేస్తోంది. ఇదివ‌ర‌కూ వంట‌ల కార్య‌క్ర‌మాల్ని షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. మొత్తానికి హంస ప్ర‌య‌త్నాల‌కు తెలుగు లోగిళ్ల‌లో బోలెడంత అండ ఉంది.

ఇటీవ‌ల ఎందుక‌నో ఈ అమ్మ‌డు టాలీవుడ్ కి పూర్తిగా దూర‌మైపోయింది. ఇక హంస లేటెస్ట్ ఫోటో సిరీస్ లో శారీలో ట్రెడిష‌న‌ల్ లుక్ తో క‌నిపించింది. పాక్షికంగా హంస అందాలను ఆ చిలుకాకుప‌చ్చ కోక ఎంతో పెంచింద‌ని చెప్పాలి. టాలీవుడ్ నుంచి దూర‌మైన ఈ బ్యూటీ న‌ట‌న విర‌మించు కున్న‌ట్టేనా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. అయితే అన్నిటికీ ధీటుగా స‌మాధాన‌మిస్తూ న‌టిగా కంబ్యాక్ అవుతుందేమో చూడాలి. ఇలా ప‌చ్చ‌కోక‌లో అంద‌మైన హంస హొయ‌లు క‌వ్విస్తున్నాయ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.