బికినీలో హంస టూమచ్ వైల్డ్
ఇక హంస సోషల్ మీడియాల్లో రెగ్యులర్ గా తన అభిమానుల కోసం ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ బో* ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
By: Tupaki Desk | 19 May 2025 5:43 PM ISTఅందాల కథానాయిక హంసానందిని పరిచయం అవసరం లేదు. హంస అందచందాలు, నటప్రతిభకు ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ హీరోలు నాగార్జున, జగపతి బాబు సహా పలువురు యువహీరోల సరసనా హంస కథానాయికగా నటించింది. కొన్ని ఐటమ్ నంబర్లలోను నర్తించిన హంస, యాక్షన్ క్వీన్ గా స్టంట్స్ కూడా చేసింది.
అయితే హంస జీవితంలో రొమ్ము క్యాన్సర్ ని గుర్తించడం కీలకమైన మలుపు. క్యాన్సర్ మహమ్మారీతో పోరాడి విజయం సాధించిన నటీమణుల్లో హంస పేరు కూడా ఉంది. క్యాన్సర్ తో పాటు కొన్ని వివాదాలు కూడా తన జీవితంలో ఊహించని మార్పులు తెచ్చాయి. ఇక చికిత్సతో క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ఆ తర్వాత బ్లాగర్ గా వ్లాగర్ గాను మారింది. కేరళ టూరిజానికి కూడా ప్రచారం చేసింది.
ఇక హంస సోషల్ మీడియాల్లో రెగ్యులర్ గా తన అభిమానుల కోసం ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ బో* ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. హంస బికినీలో వైల్డ్ గా ఫోజులిచ్చింది. అప్పుడప్పుడు ఇలా వైల్డ్ గా కనిపిస్తే తప్పేమీ లేదని కూడా సెలవిచ్చింది. హంస వంగపువ్వు రంగు బికినీలో ఫోజులిచ్చిన వీడియోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ భామ ఇటీవల సినిమాల్లో నటించడం లేదు. దాని ప్రభావం తన రూపంపై పడిందని కూడా యువతరం భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ హిప్ షేపవుట్ అయిందంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి హంస నిరంతరం జిమ్ యోగా అంటూ ఆరోగ్యసూత్రాలు ఫాలో చేస్తుంది. కానీ సినిమాల్లేకపోవడంతో ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టడం లేదని కూడా విమర్శిస్తున్నారు. అయితే పాజిటివ్ విమర్శల్ని స్వీకరించి హంస లుక్ మార్చేందుకు హార్డ్ వర్క్ చేస్తుందేమో చూడాలి.
