Begin typing your search above and press return to search.

హమ్మమ్మో.. ఫరియాతో అల్లరోడి రొమాంటిక్ లవ్

తాజాగా హమ్మెమ్మో అంటూ సాగుతున్న మెలోడియస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ ను కూడా రివీల్ చేయగా.. హీరో హీరోయిన్లు క్యూట్ గా కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 April 2024 6:59 AM GMT
హమ్మమ్మో.. ఫరియాతో అల్లరోడి రొమాంటిక్ లవ్
X

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్.. ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నారు. 2024లో కింగ్ నాగార్జునతో కలిసి నా సామిరంగా సినిమాలో నటించి మంచి హిట్ కొట్టిన ఆయన.. ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దర్శకుడు మల్లి అంకం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కాని హీరో.. తన పార్టనర్ ను సెట్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ట్రైలర్ లో చూపించారు మేకర్స్.

'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ఓ చిన్న మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. నరేష్ మార్క్ అల్లరి తో పాటు కొంచెం కమర్షియాలిటీ కూడా ఉండబోతుందని అర్ధమవుతోంది. తాజాగా హమ్మెమ్మో అంటూ సాగుతున్న మెలోడియస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ ను కూడా రివీల్ చేయగా.. హీరో హీరోయిన్లు క్యూట్ గా కనిపిస్తున్నారు.

ఇక సాంగ్ విషయానికొస్తే.. గోపీసుందర్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి. భాస్కర్ భట్ల అందించిన లిరిక్స్ కు అప్ కమింగ్ సింగర్ యశస్వి కొండేపూడి ప్రాణం పోశారు. మరోసారి తన మార్క్ చూపించారు. సాంగ్ లో విజువల్స్ నేచురల్ అండ్ రిచ్ గా ఉన్నాయి. అల్లరి నరేష్, ఫరియా కెమిస్ట్రీ బాగా పండినట్లు కనిపిస్తోంది. ఇద్దరూ ప్రేమలో పడ్డాక.. కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇక చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు మే 3వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.