Begin typing your search above and press return to search.

అందుకే లిప్ లాక్స్ టీజ‌ర్‌లో ఉండేలా ప్లాన్ చేశారా?

కానీ 'హాయ్ నాన్న‌' మూవీలో మాత్రం నాని, మృణాల్ ఠాకూర్‌ల మ‌ధ్య వ‌చ్చే మూబు లిప్ లాక్ సీన్‌ల‌ని టీజ‌ర్‌లో చూపించ‌డం మేక‌ర్స్ స్ట్రాట‌జీ అని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 5:27 AM GMT
అందుకే లిప్ లాక్స్ టీజ‌ర్‌లో ఉండేలా ప్లాన్ చేశారా?
X

ఈ మ‌ధ్య తెలుగు సినిమాల్లో లిప్‌లాక్స్ అనేవి స‌ర్వ సాధార‌ణంగా మారిపోయాయి. టాప్ స్టార్ల నుంచి అప్ క‌మింగ్ హీరోల వ‌ర‌కు లిప్ లాక్ సీన్‌లు లేకుండా సినిమాలు చేయ‌డం లేదు. గ‌తంలో ఇలాంటి సీన్‌లు అంటేనే అవ‌స‌ర‌మా? అనే హీరోలు కాస్తా ఇప్పుడు సీన్ డిమాండ్‌ని బ‌ట్టి ఉండాల్సిందే అంటున్నారు. స్టార్ గురించి ప‌క్క‌న పెడితే ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి అత్యంత ఇష్ట‌మైన హీరోగా పేరు తెచ్చుకున్న నేచుర‌ల్ స్టార్ నాని ఈ మ‌ధ్య లిప్ లాక్ సీన్‌ల‌పై అమితాస‌క్తిని చూపిస్తుండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ 'హాయ్ నాన్న‌'. నూత‌న ద‌ర్శ‌కుడు శౌర్య‌వ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు, 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన మృణాల్ ఠాకూర్ ఇందులో నానికి జోడీగా న‌టించింది.

కియారా ఖ‌న్నా కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 7న తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఆదివారం టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తూ మేక‌ర్స్ రిలీజ్ డేట్‌ని కూడా ప్ర‌క‌టించేశారు.

ప‌దేళ్ల పాప‌కు నానికి మ‌ధ్య సాగే క్యూట్ బాండింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాని ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా తెర‌కెక్కించారు. ఫాద‌ర్ అండ్ డాట‌ర్‌, మ‌ధ్య‌లో ల‌వ‌ర్ క‌థ‌గా రూపొందిన ఈ మూవీలో హీరో నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ల మ‌ధ్య రొమాంటిక్ సీన్‌లు చాలానే ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. జ‌స్ట్ షాంపిల్‌గా మూడు లిప్ లాక్ సీన్‌ల‌ని టీజ‌ర్‌లో చూపించారు. ఇలాంటి సీన్‌ల‌ని చాలా వ‌ర‌కు సినిమాలో చూపించ‌డానికే ఇష్ట‌ప‌డే మేక‌ర్స్ ఫ‌స్ట్ టైమ్ టీజ‌ర్‌లో రిలీల్ చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

గ‌తంలో నాని న‌టించిన జెర్సీ, శ్యామ్ సింగ‌రాయ్ వంటి సినిమాల్లో లిప్ లాక్ సీన్‌లున్నాయి. అయితే వాటిని టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌లో పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌లేదు. కానీ 'హాయ్ నాన్న‌' మూవీలో మాత్రం నాని, మృణాల్ ఠాకూర్‌ల మ‌ధ్య వ‌చ్చే మూబు లిప్ లాక్ సీన్‌ల‌ని టీజ‌ర్‌లో చూపించ‌డం మేక‌ర్స్ స్ట్రాట‌జీ అని తెలుస్తోంది. టైటిల్‌కు త‌గ్గ‌ట్టు క్యూట్ సీన్‌ల‌ని చూపిస్తే ప్రేక్ష‌కులు ఇదొక తండ్రీ కూతుళ్ల సినిమా అనుకుంటారే కానీ ఇందులోనూ ఓ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ ఉంద‌ని ఫీల‌వ‌ర‌ని భావించిన మేక‌ర్స్ టీజ‌ర్‌లోనే లిప్ లాక్ సీన్‌ల‌ని రివీల్ చేయాల‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.