Begin typing your search above and press return to search.

హబీబీ జిలేబీ.. హుషారెత్తించేలా రోషన్ బబుల్​ గమ్​ సాంగ్​

క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ఈ బబుల్ గమ్​ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   3 Nov 2023 9:07 AM GMT
హబీబీ జిలేబీ.. హుషారెత్తించేలా రోషన్ బబుల్​ గమ్​ సాంగ్​
X

యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా వెండితెరకు పరిచయం కానున్న చిత్రం బబుల్ గమ్. రీసెంట్​గా ఈ చిత్ర టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమా నుంచి ఓ సాంగ్​ను విడుదల చేశారు మేకర్స్. బస్సీలో హీరోహీరోయిన్​పై చిత్రీకరించిన ఈ పాట హుషారెత్తించేలా మంచి బీట్​తో సాగింది.


వివరాళ్లోకి వెళితే.. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో రానున్న చిత్రం బబుల్ గమ్. ఓ రిచ్ గర్ల్ అండ్ పూర్ బాయ్ మధ్య సాగే లవ్ స్టోరీని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్​లో రోషన్ కనకాల తన స్టైల్ అండ్ స్వాగ్​తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్​లో అతడి డైలాగ్స్, హీరోయిన్​తో రొమాన్స్, ఘాటైన లిప్​ కిస్​లు హైలైట్​గా నిలిచాయి. యూత్​కు బాగానే కనెక్ట్ అయిందీ ప్రచార చిత్రం.

క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ఈ బబుల్ గమ్​ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. రోషన్ కనకాల సరసన మనసా చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తోంది.

సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రాన్ని సినీ ప్రముఖుల చేత బాగానే ప్రమోట్ చేయిస్తున్నారు. అలా ఈ క్రమంలోనే తాజాగా మంచి బీట్​ ఉన్న హబీబీ యూ ఆర్​ మై జిలేబీ అంటూ సాగే సాంగ్​ను రిలీజ్​ చేశారు. ఈ పాటకు శ్యామ్ అందించిన లిరిక్స్​కు, శ్రీ చరణ్ పాకాల అందించిన మ్యూజిక్ హైలైట్​గా ఉంది. శ్రోతలను హుషారెత్తించేలా ఉంది.

సాంగ్​ లిరిక్స్, బీట్​కు తగ్గట్టు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు​, హీరోయిన్​తో కలిసి రోషన్ వేసిన డ్యాన్స్​ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. అతడి డ్రెస్సింగ్ స్టైల్​ కూడా బాగుంది. గల్లీలో ఎంటర్ అయిన రిచ్​ పిల్లను చూసి లవ్​లో పడిపోయిన హీరో.. హీరోయిన్​ వల్ల తన లైఫ్ ఎలా మారింది, తనకు కలిగిన ఫీలింగ్స్​న్స్​ను ఎక్స్​ప్రెస్ చేసేలా సాగిందీ సాంగ్. పొలాకి విజయ్ కొరియోగ్రఫీ చేశారు. రోషన్​ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.