మలయాళీ హిట్ తెలుగు ట్రైలర్.. జింఖానా గ్లింప్స్ చూశారా?
బాక్సింగ్ సీక్వెన్స్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నస్లెన్ సహా పలువురు యువకులు బాక్సింగ్ అకడామీలో చేరాలనుకుంటారు.
By: Tupaki Desk | 19 April 2025 12:27 PMమలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఎన్నో సినిమాలు.. కొంతకాలంగా తెలుగులో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రేమలు మూవీ మాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో తన యాక్టింగ్ తో యంగ్ యాక్టర్ నస్లేన్ కె.గపూర్ తెలుగు సినీ ప్రియులను మెప్పించారు.
ఇప్పుడు జింఖానా మూవీ మరోసారి తెలుగులో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా ఖలీద్ రెహామాన్ తెరకెక్కించిన ఆ సినిమా.. అలప్పుజ జింఖానా పేరుతో ఇప్పటికే మలయాళంలో రిలీజై అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ రేంజ్ లో రెస్పాన్స్ సంపాదించుకుని.. అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరిస్తూ దూసుకెళ్తోంది.
ఇప్పుడు తెలుగులో ఏప్రిల్ 25వ తేదీన జింఖానా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్.. తాజాగా ట్రైలర్ ను తీసుకొచ్చారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎక్స్ వేదికగా ట్రైలర్ ను షేర్ చేశారు. ప్రేమలు మూవీ నస్లేస్ యాక్టింగ్ కు తాను ఫిదా అయ్యానని తెలిపారు. ఇప్పుడు నస్లేన్ నుంచి మరో అద్భుతమైన చిత్రం వస్తుందన్నారు.
బాక్సింగ్ సీక్వెన్స్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నస్లెన్ సహా పలువురు యువకులు బాక్సింగ్ అకడామీలో చేరాలనుకుంటారు. ఆ తర్వాత అకాడమీలో చేరి కొత్త జీవనశైలికి అలవాటుపడి ప్రొఫెషనల్ బాక్సర్లుగా మారడానికి వారి చేసిన పోరాటమే సినిమా కథగా తెలుస్తోంది. ట్రైలర్ లో నస్లేన్ సంభాషణలు.. అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
బాక్సింగ్ ట్రైనింగ్ ను సరిగ్గా అర్థం చేసుకోని అబ్బాయిల పంచ్ లు ఫన్నీగా ఉన్నాయి. యువకుల అమాయకత్వం, వారి యాక్టింగ్ మెప్పిస్తోంది. అయితే ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఎఫెక్ట్స్, థీమ్ అన్నీ ప్రేమలు శైలిలో మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా జింఖానా మూవీ ఉండనుందని క్లియర్ గా చెబుతున్నాయి.
అయితే డబ్బింగ్ క్వాలిటీ.. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. దీంతో సినిమాపై మూవీ లవర్స్ లో ఇంట్రెస్ట్ పెరుగుతోందని చెప్పాలి. అదే సమయంలో ట్రైలర్ చివర్లో బాలకృష్ణను ఇమిటేట్ చేస్తూ నస్లేన్ చెప్పే డైలాగ్ లు మెపిస్తున్నాయి. ఓ రేంజ్ లో నవ్వులు పూయిస్తున్నాయి.. అలా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేస్తోంది. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.