గ్రహాంతర వాసికి గురువు గానా?
ఈ మధ్య కాలంలో సినిమాల్లో గురువు పాత్రలు హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Jun 2025 8:05 AMఈ మధ్య కాలంలో సినిమాల్లో గురువు పాత్రలు హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో 'సైరా నరసింహారెడ్డి'లో చిరంజీవి గురువు పాత్రలో అమితాబచ్చన్ కనిపించారు. ఆ తర్వాత మళ్లీ 'కల్కి 2898' లో నటించారు. తొలి భాగంలో పేరుకే ప్రభాస్ హీరో అయినా ....అసలైన హీరోయిజం అంతా అమితా బచ్చన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీంతో 'కల్కి 2'లో అమితాబ్ ప్రభాస్ కి గురువు పాత్రలో కనిపిస్తారని సమాచారం.
అలాగే బాలీవుడ్ సినిమా 'కింగ్' కోసం అమీర్ ఖాన్ కూడా కుమార్తె సుహానాఖాన్ పాత్రకు గురువుగా కని పిస్తాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా పాత్రలకు గురువు ఉండటం చాలా సినిమాల్లో చూసాం. ఈ నేపథ్యంలో తాజాగా గ్రహాంతర వాసికి కూడా గురువును దించుతున్నారు. అమీర్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హీరాణి తెరకెక్కించిన 'పీకే' ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు.
అమీర్ ఖాన్ కెరీర్ లో పీకే మరో మైల్ స్టోన్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడా కాంబినేషన్ ఈ సినిమాకు సీక్వెల్ కు సన్నాహాలు చేస్తోంది. ఇందలో అమీర్ ఖాన్ తన పాత్రలో యధావిధిగా కనిపిస్తాడు. అయితే ఈ ఈ సినిమా సీక్వెల్ లో ఆ పాత్రకు ఓ గురువు పాత్ర కూడా ఉందని తెలిసింది. అందులో రణవీర్ సింగ్ ఎంపికైనట్లు సమాచారం. అంటే రణవీర్ కూడా కొన్ని సన్నివేశాల్లో అచేధనంగా కనిపించడం ఖాయమే.
అమీర్ ఖాన్ కొన్ని సన్నివేశాల కోసం అలా నటించిన సంగతి తెలిసిందే. ప్రయివేట్ భాగం ముందు రేడియో ఆట్టుపెట్టుకు కనిపిస్తాడు. సినిమాలో రోల్ డిమాండ్ చేయడంతో అమీర్ కూడా అంతే సహక రించడంతోనే అది సాధ్యమైంది. సినిమా సక్సెస్ లో కీలక భాగస్వామిగా మారారు. ఇప్పుడు సీక్వెల్ కోసం రణవీర్ సింగ్ తో చర్చలు జరుపుతున్నారు. న్యూడ్ గా నటించడం రణవీర్ సింగ్ కి కొత్తేం కాదు.
కొన్నాళ్ల క్రితం రణవీర్ సింగ్ తన న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలోకి వదలడంతో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. దీనిపై కేసు కూడా ఫైల్ అయింది. మహిళల మనోభావాలు దెబ్బ తీసినందుకు మహిళలంతా భగ్గుమన్నారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రయోగాలు చేయలేదు. మళ్లీ పీకే సీక్వెల్ కోసం రెడీ అయ్యే అవకాశం ఉంది.