Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. నెక్స్ట్ సౌండ్ ఎలా ఉండబోతోందంటే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమాపై రోజురోజుకు అంచనాల స్థాయి గట్టిగానే పెరుగుతుంది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 10:29 AM GMT
గుంటూరు కారం.. నెక్స్ట్ సౌండ్ ఎలా ఉండబోతోందంటే..
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమాపై రోజురోజుకు అంచనాల స్థాయి గట్టిగానే పెరుగుతుంది. మొదట ఈ సినిమాకు ఊహించిన విధంగా బ్రేకులు పడటంతో అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో అని గుసగుసలు ఎక్కువగానే వినిపించాయి. కానీ మొదటి పాట విడుదలైన తర్వాత త్రివిక్రమ్ ఓ వర్గం ఫ్యాన్స్ లో అయితే గట్టి నమ్మకాన్ని నెలకొల్పాడు.

తప్పకుండా సినిమా మాస్ మసాలా యాక్షన్ డోస్ తో సరికొత్తగా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ ను డిసెంబర్ 20 లోపు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అని ముందుగానే క్లారిటీ కూడా ఇచ్చేశారు.

ఇక దానికి తగ్గట్టుగా సినిమాపై అప్డేట్స్ కూడా రెగ్యులర్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒక పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ధమ్ మసాలా అనే ఆ పాట మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఎట్రాక్ట్ చేసింది. ఇక తర్వాత రాబోయే పాటలు అంతకుమించి అనేలా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తాయి అని తెలుస్తుంది.

రెండో పాట వచ్చేవారం విడుదలవుతుంది అని ఇప్పటికీ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ సాంగ్ మెలోడీ డ్యూయెట్ గా ఉండబోతుంది అని కూడా తెలుస్తుంది. ఇక తర్వాత వచ్చే రెండు పాటలు కూడా ఫుల్ మాస్ వైబ్రేషన్స్ తెప్పించేలా ఉంటాయట. ముఖ్యంగా శ్రీలీల మహేష్ బాబు ఇద్దరు కూడా మాస్ స్టెప్పులు వేయబోతున్నారట.

అంతే కాకుండా లుంగీ డాన్స్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో మాస్ సాంగ్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా సినిమాలో హైలైట్ అవుతుంది అని టాక్. మొత్తానికి ఈసారి తమను సౌండ్ గట్టిగా వినిపించేలా ఆల్బమ్ సెట్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా అల.. వైకుంఠపురములో.. రేంజ్ లో మ్యూజికల్ హిట్టుగా నిలుస్తుందో లేదో చూడాలి.