Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. ట్రైలర్ కు ముందు మరో సర్ ప్రైజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం గుంటూరు కారం.

By:  Tupaki Desk   |   29 Dec 2023 5:18 AM GMT
గుంటూరు కారం.. ట్రైలర్ కు ముందు మరో సర్ ప్రైజ్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాలో సూపర్ స్టార్ కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వీరిద్దరి కెరియర్ లో ఇదే స్టార్ హీరో మూవీ కావడం విశేషం. దీంతో సినిమాపై ఇద్దరు చాలా హోప్స్ పెట్టుకున్నారు. శ్రీలీలకి అయితే గుంటూరు కారం హిట్ చాలా అవసరం అని చెప్పాలి.

స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ లు శ్రీలీల ఈ ఏడాది తన ఖాతాలో వేసుకుంది. కొత్త ఏడాదిలో అంతా శుభం జరుగుతుందని బలంగా నమ్ముతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ ని జనవరి మొదటి వారంలో రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. షూటింగ్ కూడా చివరి దశకి వచ్చేసింది. దీంతో త్రివిక్రమ్ ఎక్కువగా మూవీపైన వర్క్ చేస్తున్నారు.

సంక్రాంతి నాటికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫైనల్ కాపీ సిద్ధం చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కట్ చేసిన ట్రైలర్ ప్రోమో బాగుందనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో డాన్స్ నంబర్స్ ఉండటంతో ప్రోమోని కూడా నాలుగు, ఐదు అదిరిపోయే డాన్స్ స్టెప్పులని పెట్టి కట్ చేశారని వినికిడి. అలాగే త్రివిక్రమ్ కి బలం డైలాగ్స్, అలాంటి ఇంటరెస్టింగ్ డైలాగ్స్ కూడా ట్రైలర్ లో పెట్టారని టాక్.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రెండేళ్ళ వరకు బిగ్ స్క్రీన్ పైన మళ్ళీ కనిపించడు. రాజమౌళి సినిమాకి కమిటయ్యాడు. ఆ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కబోతోంది. ఈ కారణంగా సూపర్ స్టార్ నుంచి రెండేళ్ళ వరకు సినిమా ఎక్స్ పెక్ట్ చేయలేం. ఈ కారణంగానే మహేష్ అభిమానులు గుంటూరు కారం సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

త్రివిక్రమ్ మహేష్ తో చేసిన రెండు సినిమాలు థియేటర్స్ లో సక్సెస్ కాలేదు. అయితే క్లాసిక్ మూవీస్ గా నిలిచాయి. ఈ సారి మాత్రం థియేటర్స్ లో కూడా గ్రాండ్ సక్సెస్ కొట్టే మాస్ కథతో గుంటూరు కారంలో మహేష్ ని చూపించబోతున్నారనే మాట వినిపిస్తోంది.