Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. ఆ లోపు రెండోది!

సెకండ్ సింగిల్ డిసెంబర్ 10 లోపు వచ్చేలా త్రివిక్రమ్ పనులను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాంగ్ షూటింగ్ ను డిసెంబరు 5 లోపు ఫినిష్ చేయాల్సి ఉందట.

By:  Tupaki Desk   |   29 Nov 2023 8:43 AM GMT
గుంటూరు కారం.. ఆ లోపు రెండోది!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ద్వారా అయితే ఇప్పుడిప్పుడే ఈ సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంటుంది. ఇంతకుముందు అయితే సినిమా షూటింగ్ వాయిదా పడడమే కాకుండా నటీనటుల విషయంలో మార్పులు అలాగే టెక్నీషియన్స్ విషయంలో కూడా ఊహించని గాసిప్స్ వచ్చాయి.

దీంతో సినిమా అసలు అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి కానీ దర్శకుడు త్రివిక్రమ్ మళ్ళీ సరైన ప్లానింగ్ తో గుంటూరు కారంను ఒక ట్రాక్ లోకి తీసుకువచ్చాడు. ఇక ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చారు. అందుకు తగ్గ ప్రణాళికతో అప్డేట్స్ కూడా ఇస్తున్నారు.

ఇప్పటికే ధమ్ మసాలా అనే పాటను విడుదల చేశారు. ఇక ఆ పాటకు కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. అయితే రెండో పాట ఎప్పుడూ విడుదల చేయబోతున్నారు అనే ప్రశ్నకు కూడా గతంలో నిర్మాత నాగ వంశీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అసలైతే ఈ వరమే రెండో పాట విడుదలవుతుంది అని కూడా ఆయన అన్నారు. కానీ సాంగ్ షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో ఇప్పుడు ప్లాన్ మార్చేశారు.

సెకండ్ సింగిల్ డిసెంబర్ 10 లోపు వచ్చేలా త్రివిక్రమ్ పనులను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాంగ్ షూటింగ్ ను డిసెంబరు 5 లోపు ఫినిష్ చేయాల్సి ఉందట. ఇక ఆ వర్క్ ఫినిష్ అయితే సెకండ్ సింగిల్ ను విడుదల చేయాలి అని అనుకుంటున్నారు. ఈ పాట మాత్రం మెలోడీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు నాలుగు పాటలను కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం.

శ్రీలీల అలాగే మహేష్ బాబు మధ్యలో వచ్చే ఒక మాస్ పాట కూడా అద్భుతంగా ఉండబోతుందట. అందులో మహేష్ బాబు శ్రీలీల ఇద్దరు కూడా లుంగీ గెటప్స్ లో కనిపిస్తారు అని తెలుస్తోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఒక స్పెషల్ గ్లామరస్ రోల్ లో కనిపించనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబుకు ఇది మూడో సినిమా కావడంతో ఫాన్స్ లో అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా అతడు సినిమాలో కంటే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.