Begin typing your search above and press return to search.

మహేష్ బాబు.. చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఇలా

అయితే ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఒకటి తెరపైకి వచ్చింది. గుంటూరు కారం నుంచి ఏడో సాంగ్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందంట.

By:  Tupaki Desk   |   12 March 2024 4:17 AM GMT
మహేష్ బాబు.. చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఇలా
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ తోనే మూవీకి ఆ మాత్రం పాజిటివ్ టాక్ అయిన వచ్చింది. సినిమాలో ఎక్కడగా కూడా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ప్రెజెన్స్ కనిపించలేదని సినీ విశ్లేషకులు అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ మూవీ రిలీజ్ అయ్యి రెండు నెలలు అవుతోంది. ఓటీటీలో కూడా మూవీ రిలీజ్ అయిపొయింది. డిజిటల్ ఆడియన్స్ ని కొంత వరకు ఈ మూవీ మెప్పించింది. అయితే ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఒకటి తెరపైకి వచ్చింది. గుంటూరు కారం నుంచి ఏడో సాంగ్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందంట.

మూవీ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత, ఆడియన్స్ కూడా సినిమా గురించి పూర్తిగా మరిచిపోయిన తర్వాత సాంగ్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారనేది క్లారిటీ లేదు. అయితే సినిమా చరిత్రలోనే ఇలా చేయడం మొదటి సారి అనే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా మూవీ రిలీజ్ అయ్యి రెండు నెలల తర్వాత సాంగ్స్ రిలీజ్ చేసే ప్రయత్నం చేయలేదు.

గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం ఇది సాధ్యం అవుతుంది. దీనిపై చిత్ర యూనిట్ ఏమైనా క్లారిటీ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మూవీ లెంత్ ఎక్కువ కావడంతో షూట్ చేసిన ఒక సాంగ్ ని పక్కన పెట్టారు. దానిని వృధా చేయడం ఇష్టం లేక డిజిటల్ కాపీకి ఆ సాంగ్ ని అదనంగా యాడ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

మరి ఈ సాంగ్ ఏ మేరకు ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్నతో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఒప్పుకున్న కమర్షియల్ యాడ్ షూట్స్ కూడా కంప్లీట్ చేసి మొత్తం మూడేళ్ళ పాటు రాజమౌళి సినిమా కోసం వెచ్చించనున్నాడంట. మూవీలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

అలాగే రాజమౌళి సినిమా రేండు భాగాలుగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం దాదాపు 1500 కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్. రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క. రాబోయే మహేష్ సినిమా మరొక లెక్క అనే విధంగా ఉండబోతోంది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ కంటే ముందు రెండు నెలల వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు సమాచారం.