Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. అచ్చంగా సలార్ లాగే

అచ్చం సలార్ తరహాలోనే ఈ చిత్రానికి కూడా అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు, నాలుగు గంటలకు రెగ్యులర్ షోలు పడబోతున్నాయి.

By:  Tupaki Desk   |   9 Jan 2024 11:15 AM GMT
గుంటూరు కారం.. అచ్చంగా సలార్ లాగే
X

మంచి క్రేజ్ ఉన్న పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పొద్దు పొద్దున్నే షోలు పడిపోతుంటాయి. మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి గాని ఇప్పుడు ఏపీ, తెలంగాణ రెండు చోట్ల ఈజీగానే ఈ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. హైదరాబాదులో అయితే మిడ్ నైట్ షోలు పడుతుండడం విశేషం. ఇటీవల సలార్ చిత్రానికి అర్ధ రాత్రి ఒంటిగంటకే షోలు పడ్డ సంగతి తెలిసిందే.

హైదరాబాద్ సహా తెలంగాణలోని నగరాల్లోని 23 థియేటర్లలో ఒంటి గంట షోలు వేశారు. మిగతా థియేటర్లన్నింటిలో తెల్లవారుజామున 4 గంటలకు షోలు ప్రారంభమయ్యాయి. ఆ సినిమాకు రేట్లు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు సంక్రాంతి సినిమా గుంటూరు కారం విషయంలో కూడా ఇదే జరిగింది.

అచ్చం సలార్ తరహాలోనే ఈ చిత్రానికి కూడా అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు, నాలుగు గంటలకు రెగ్యులర్ షోలు పడబోతున్నాయి. హైదరాబాదులోని ఏఎంబి సినిమాస్ సహా 23 థియేటర్లలో బెనిఫిట్ షోల కోసం అనుమతులు ఇచ్చారు. మిగతా అన్ని థియేటర్లలోనూ తెల్లవారు జామున నాలుగు గంటలకు షోలు మొదలవుతాయి. ఇక ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్ లలో 65 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 100 రూపాయలు రేట్లు పెంచుకునేందుకు అనుమతులు లభించాయి.

దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లలో 250, మల్టీప్లెక్స్ లో 410 చొప్పున టికెట్ ధరలు ఉండబోతున్నాయి. అదనపు షోలు, రేట్ల వల్ల గుంటూరు కారం చిత్రానికి ఒక రేంజ్ లో ఓపెనింగ్స్ రాబోతున్నాయి అన్నది స్పష్టం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. హారిక అండ్ హాసిని సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. జనవరి 12న గుంటూరు కారం రిలీజవుతోంది.