Begin typing your search above and press return to search.

క్లాస్ లుక్ తో కారం దంచేస్తున్నారు.. పోస్టర్ తో అంచనాలు పీక్స్..!

ఈ పోస్టర్ తో గుంటూరు కారం పై ఇప్పటివరకు వచ్చిన నెగిటివిటీ మొత్తం పోయింది. మహేష్ లోని ఊర మాస్ యాటిట్యూడ్ ని త్రివిక్రం ఈ సినిమాలో చూపిస్తునారని అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 7:02 AM GMT
క్లాస్ లుక్ తో కారం దంచేస్తున్నారు.. పోస్టర్ తో అంచనాలు పీక్స్..!
X

సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో 11 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా గుంటూరు కారం. హారిక హాసిని బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో మొదటి నుంచి ఎక్కడో ఒక చోట నెగిటివిటీ ఏర్పడుతూ వచ్చింది. థమన్ ఇస్తున్న సాంగ్స్ కానివ్వొచ్చు.. ఫస్ట్ టీజర్ కానివ్వొచ్చు ఇలా గుంటూరు కారం మీద కొన్ని ట్రోల్స్ బాగా హడావుడి చేశాయి. మహేష్ సైతం ఈ విషయంపై త్రివిక్రం తో డిస్కస్ చేశాడని టాక్. అయితే నిర్మాత నాగ వంశీ మాత్రం వీటిని పట్టించుకోవద్దు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాం అంటున్నారు.


ఇక లేటెస్ట్ గా సినిమా నుంచి మహేష్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మహేష్ డాషింగ్ లుక్స్ తో పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్ తో గుంటూరు కారం పై ఇప్పటివరకు వచ్చిన నెగిటివిటీ మొత్తం పోయింది. మహేష్ లోని ఊర మాస్ యాటిట్యూడ్ ని త్రివిక్రం ఈ సినిమాలో చూపిస్తునారని అర్థమవుతుంది. లేటెస్ట్ గా సినిమాలోని నెక్స్ట్ సింగిల్ మాస్ సాంగ్ అప్డేట్ కూడా ఇచ్చారు.

దానితో పాటుగా మహేష్ లుంగి లుక్ తో శ్రీ లీల నుంచి అలా ముందుకు వస్తున్న లేటెస్ట్ పోస్టర్ కూడా అదిరిపోయింది. చెక్ షర్ట్ లుంగి తో మహేష్ ఇంటెన్స్ లుక్ అదుర్స్ అనిపిస్తుంది. ఇక శ్రీ లీల హాఫ్ శారీలో బ్యూటిఫుల్ గా ఉంది. వెనుక రఘుబాబు ఉన్నాడు. ఈ పోస్టర్ లో జనవరి 12న రిలీజ్ డేట్ కూడా వేశారు.

సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ విషయంపై ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎవరికి వారు తమ రిలీజ్ డేట్ పోస్టర్స్ తో వస్తున్నారు. మహేష్ గుంటూరు కారం మాత్రం తప్పనిసరిగా అనుకున్న డేట్ కి వస్తుందని అంటున్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న భారీ సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాలో మహేష్ మాస్ లుక్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించడం పక్కా అని చెబుతున్నారు చిత్ర యూనిట్. సంక్రాంతికి గుంటూరు కారంతో పాటుగా రవితేజ ఈగల్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ భారీ అంచనాలతో వస్తుండగా సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.