Begin typing your search above and press return to search.

గుంటూరు కారం మీనాక్షి మీమ్స్.. నవ్వు ఆపుకోలేరు!

ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడి, రకరకాల అడ్డంకులు తట్టుకుని ఈ సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Jan 2024 5:35 AM GMT
గుంటూరు కారం మీనాక్షి మీమ్స్.. నవ్వు ఆపుకోలేరు!
X

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడి, రకరకాల అడ్డంకులు తట్టుకుని ఈ సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీలీలతోపాటు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా కనిపించనున్నారు.


అయితే గుంటూరు కారం సినిమా నుంచి ఎప్పుడూ లేనంతగా మహేశ్ బాబువి చాలా పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే హీరోయిన్స్ తో ఉన్నవి కూడా విడుదల చేశారు. అయితే మొదట్నుంచి మహేశ్ శ్రీలీలతో ఉన్న పోస్టర్స్, సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. కానీ మీనాక్షి చౌదరి పోస్టర్ ఒక్కటి కూడా విడుదల చేయలేదు. అసలు ఆమె సినిమాలో ఉందా? లేక డ్రాప్ అయిందా? అనే డౌట్ లు కూడా వచ్చాయి.

దీంతో మేకర్స్.. మహేశ్, మీనాక్షి ఉన్న పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మీనాక్షి.. రాజీ పాత్రలో నటించినట్లు క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ లో మహేశ్ బాబు కూర్చొని ఉండగా మీనాక్షి వెనుక నిల్చొని హీరోపై చేతులు వేసి ఉంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఆ పోజ్ మహేశ్ కు మసాజ్ చేసినట్టు కొంతమందికి అనిపించడంతో ఈ పోస్టర్ పై సరదాగా అనేక మీమ్స్ చేశారు.

మహేశ్ స్థానంలో వేరే సెలబ్రిటీలను పెట్టి మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేశారు మీమర్స్. కమెడియన్ బ్రహ్మనందం, డైరెక్టర్ త్రివిక్రమ్ ఫొటోలను మహేశ్ ప్లేస్ లో పెట్టి క్రియేట్ చేసిన మీమ్ అయితే ఫుల్ వైరల్ అవుతోంది. వేరే సినిమాల్లోని కొన్ని సీన్స్ తో కంపేర్ కూడా చేస్తూ పోస్టర్స్ వేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మీనాక్షి మీమ్సే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన వారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ఇప్పుడు ఈ మీమ్స్ తోనే మీనాక్షి చౌదరి ఫుల్ ఫేమ్ సంపాదిస్తుందని నెటిజన్లు అంటున్నారు. సినిమాలో గానీ యాక్షన్ తో అదరగొడితే మంచి మార్కులు కొట్టేస్తుందని చెబుతున్నారు. హిట్ -2, ఖిలాడీ సినిమాల్లో నటించినా.. ఇప్పుడు ఈ మీమ్స్ తో పాపులర్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు, త్రివిక్రమ్ అందమైన నటీమణులను సెకండ్ హీరోయిన్స్గా సెలెక్ట్ చేసుకుని, వారిని సరిగా ఉపయోగించుకోరనే ఓ సెంటిమెంట్ అభిమానుల్లో ఉంది. అత్తారింటికి దారేదిలో ప్రణీత, అజ్ఞాతవాసిలో అను ఇమ్మాన్యూయేల్, అలా వైకుంఠపురంలో నివేదా పేతురాజ్ను అలాగే చేశారనే అభిప్రాయం ఉంది.

ఇప్పుడు మీనాక్షి విషయంలో కూడా అలాగే జరుగుతుందా? లేదా ఈ ముద్దుగుమ్మ ట్రెండ్ సెట్ చేస్తుందా? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

కేవలం రెండు, మూడు సీన్లు, ఓ పాటకు పరిమితం చేసి షోపీస్లా చేయకుండా, మీనాక్షి టాలెంట్ ను గురూజీ పూర్తిగా వినియోగించుకుని ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. మరి సినిమాలో ఈ ముద్దుగుమ్మ రోల్ ఎలా ఉంటుందో అనేది గుంటూరు కారం రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది.