Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. మరో లీకు దెబ్బ

ఇప్పుడు మహేష్ బాబు, శ్రీలీల మీద చిత్రీకరించిన డ్యూయెట్ సాంగ్ బిట్ ని ఎవరో ట్విట్టర్ లో షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 3:45 AM GMT
గుంటూరు కారం.. మరో లీకు దెబ్బ
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అది కూడా డిసెంబర్ 21 నాటికి పూర్తయిపోతుందని నిర్మాత నాగ వంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

మరో వైపు ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ పై మహేష్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంగ్స్ అస్సలు బాగోలేదని చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఏకంగా థమన్, నిర్మాత నాగవంశీని ట్యాగ్ చేసి విమర్శలు చేస్తున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలకి మంచి సాంగ్స్ ఇచ్చి గుంటూరు కారంకి సరిగా ఇవ్వడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

మరో వైపు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ మధ్య వార్ నడుస్తోందని ప్రచారం నడుస్తోంది. దీనిపై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చి పుకార్లు నమ్మొద్దని చెప్పాడు. గుంటూరు కారం సినిమా చుట్టూ ఓ వైపు ఈ తలనొప్పులు ఉంటే మరో వైపు లీకుల బెడద ఎక్కువైంది. ఆ మధ్యకాలంలో మహేష్ బాబు రోడ్డు మీద డాన్స్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలోకి వచ్చింది.

ఇప్పుడు మహేష్ బాబు, శ్రీలీల మీద చిత్రీకరించిన డ్యూయెట్ సాంగ్ బిట్ ని ఎవరో ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ బిట్ కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ బిట్ లో వినిపిస్తోన్న సాంగ్ మీద మహేష్ అభిమానులు మళ్ళీ థమన్ ని ఎసుకున్తున్నారు. మా హీరోకి ఎలాంటి చెత్త పాటలు ఇస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు.

సాంగ్స్ విషయంలో ఎప్పుడైనా హీరో, దర్శకుల నిర్ణయమే ఫైనల్. వారికి నచ్చినట్లే ఇవ్వాలి. థమన్ ఇచ్చిన సాంగ్ ట్యూన్స్ కూడా వారిద్దరూ ఒకే చేసినవే కాని అవి నచ్చకపోయే సరికి అభిమానులు నేరుగా మ్యూజిక్ డైరెక్టర్ ని విమర్శిస్తున్నారు. మరో వైపు రెగ్యులర్ గా జరుగుతోన్న లీకులతో గుంటూరు కారం సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ ఆడియన్స్ లోకి వెళ్తోందని టాక్ వినిపిస్తోంది.