Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్.. గుంటూరు కారం దెబ్బ అదుర్స్

తొలి రోజు ఏకంగా 41 గుంటూరు కారం షోలు వేయనుంది ప్రసాద్ ఐమ్యాక్స్. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే తొలి షో మొదలుపెట్టనుంది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 7:48 AM GMT
ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్.. గుంటూరు కారం దెబ్బ అదుర్స్
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్ల విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వడంతో.. ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తోంది. మహేశ్ కూడా చాలా ఏళ్ల తర్వాత ఫుల్ మాస్ రోల్ చేస్తుండడంతో.. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే మహేశ్ బాబు సినిమా అంటేనే సరికొత్త రికార్డులు నమోదు అవుతుంటాయి! అలాగే ఇప్పుడు గుంటూరు కారం దుమ్ములేపడం మొదలైంది. ఈ క్రమంలోనే ఓ సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ ను నమోదు చేసిందీ చిత్రం. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం స్క్రీన్స్ గుంటూరు కారం సినిమాకే దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఒక సింగిల్ థియేటర్ లో రోజుకు హైయెస్ట్ గా ఆరు షోలు మాత్రమే సాధ్యం. అదే మల్టీప్లెక్సుల్లో ఎక్కువ స్క్రీన్లు ఉంటాయి కనుక.. అనేక షోలు పడతాయి. దీంత పెద్ద సినిమాల విడుదల సమయంలో 10 నుంచి 30 షోలు వేస్తుంటారు నిర్వాహకులు.

అయితే హైదరాబాద్ లో మల్టీప్లెక్స్లో అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ప్రసాద్ ఐమ్యాక్సే. ఏ సినిమా విడుదలైన తొలి రోజు పొద్దున్నే థియేటర్ దగ్గర భారీ హడావుడి కనిపిస్తుంటుంది. ఇక, ఆ మల్టీప్లెక్స్ లో ఆరు స్క్రీన్స్ ఉండగా.. తొలి రోజు ఏకంగా 41 గుంటూరు కారం షోలు వేయనుంది ప్రసాద్ ఐమ్యాక్స్. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే తొలి షో మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని ప్రసాద్ మల్టీప్లెక్స్ కూడా ఇటీవలే అఫీషియల్గా అనౌన్స్ చేసింది.

ఇప్పటి వరకు ప్రసాద్ ఐమాక్స్ లో 33 షోలతో ఆర్ఆర్ఆర్ మూవీ అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డును గుంటూరు కారం బ్రేక్ చేసింది. ఈ లిస్ట్ లో రోబో-2 అన్ని భాషల్లో కలిపి 32 షోలతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత ప్లేస్ లో 31 షోలతో సలార్ ఉంది. ప్రసాద్ ఐమాక్స్ లో ఇప్పటి వరకు ఏ సినిమా టచ్ చేయని 40 షోల మార్కును గుంటూరు కారం అందుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యాక.. ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో.