Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. ఇంత రచ్చ అవసరమా?

మాటలమాంత్రికుడు తివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం

By:  Tupaki Desk   |   15 Dec 2023 5:54 AM GMT
గుంటూరు కారం.. ఇంత రచ్చ అవసరమా?
X

మాటలమాంత్రికుడు తివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం కోసం మహేశ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రమోషన్ల భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలోని ధమ్ మసాలా సాంగ్ ను విడుదల చేసిన మేకర్స్.. అదే ఉత్సాహంతో ఇటీవలే రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఓ మై బేబీ అంటూ సాగే మెలోడియస్ పాటపై భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి.

ఇక ఈ లిరికల్ సాంగ్ పై ఓ వర్గం ఫ్యాన్స్ అయితే గట్టిగానే ట్రోల్ చేశారు. అటు మ్యూజిక్ అందించిన తమన్ ను, ఇటు లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రిపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు ఈ పాట అస్సలు సెట్ కాలేదని, కావాలంటే సాంగ్ ను పూర్తి తీసేయండని కామెంట్లు చేశారు. దీంతో ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా ఏ హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్లు వచ్చినా ట్రోల్స్ వస్తుంటాయి. మేకర్స్ ఇచ్చిన అప్డేట్ తో తృప్తి చెందని వారు తమదైన శైలిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు. తమ అభిమాన నటుడి సినిమా అయినా కూడా నచ్చకపోతే అలానే చేస్తారు. అయితే మేకర్స్, హీరోలు, హీరోయిన్లు తమ సినిమా అప్డేట్లపై వస్తున్న ట్రోల్స్ ను అస్సలు పట్టించకోరు. ఒకవేళ మీడియా ట్రోలింగ్ కోసం అడిగినా ఆ ప్రశ్నను దాట వేస్తారు.

కానీ ఇప్పుడు మహేశ్ సాంగ్ పై ట్రోల్స్ విషయంలో వేరేలా జరిగింది. తాను రాసిన లిరిక్స్ పై వస్తున్న ట్రోల్స్ పై గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఘాటుగా స్పందించారు. ట్రోలర్స్ పై కాస్త పరోక్షంగా మండిపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండంటూ ఫైర్ అయ్యారు. దీంతో సాంగ్ పై ట్రోల్స్ ఇప్పుడు మరింత పెరిగాయి.తెలియని వాళ్ళకి కూడా తెలిసి కొంచెం నెగటివిటీ పెరిగింది అని అనుకోవాలి .

రామజోగయ్య శాస్త్రి ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మళ్లీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఆయన స్పందించకోపోయి ఉంటే బాగుండేదని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఆయన స్పందన వల్ల పాటపై నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఒక వేళ స్పందించినా కాస్త స్మూత్ గా డీల్ చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఈ సినిమా నుంచి మరో మూడు పాటలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. మరో అప్పుడేం జరుగుతుందో చూడాలి.

గుంటూరు కారం సినిమాలో మహేశ్ సరసన శ్రీలీలతోపాటు మీనాక్షి చౌదరీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, రఘబాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ.. హారిక్ అండ్ హాసిన్ క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన మూవీ రిలీజ్ కానుంది.