Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. సాంగ్ రెడీయే కానీ..

అయితే మ్యూజిక్, సాంగ్స్ విషయంలో మహేష్ బాబు డెసిషన్ ఫైనల్. తన సినిమా పాటల విషయం మహేష్ బాబు చాలా క్లారిటీతో ఉంటారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 4:11 AM GMT
గుంటూరు కారం.. సాంగ్ రెడీయే కానీ..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గుంటూరు కారం. భారీ బడ్జెట్ తో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సెకండ్ లీడ్ రోల్ లో మీనాక్షి చౌదరి కనిపించబోతోంది. ఇప్పటికే షూటింగ్ 30 శాతం వరకు కంప్లీట్ అయినట్లు టాక్.

త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోందంట. నిజానికి ఈ చిత్రంలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే కథలో మార్పులు చేయడంతో ఆమె క్యారెక్టర్ తీసేశారు. సెకండ్ లీడ్ గా ఉన్న శ్రీలీల మొదటి ప్లేస్ లోకి వచ్చింది.

గుంటూరు బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి కథాంశంతో ఈ చిత్రం ఉంటుందనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఉండటం విశేషం.

మహేష్ బాబు చాలా ఏళ్ల తర్వాత మరల ఇలాంటి మాస్ రోల్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మ్యూజిక్, సాంగ్స్ విషయంలో మహేష్ బాబు డెసిషన్ ఫైనల్. తన సినిమా పాటల విషయం మహేష్ బాబు చాలా క్లారిటీతో ఉంటారు. తమన్ రీసెంట్ గా టైటిల్ సాంగ్ కోసం ట్యూన్ సిద్ధం చేసారంట.

ఈ ట్యూన్ ని రీసెంట్ గా మహేష్ బాబుకి వినిపించడం జరిగిందంట. ట్యూన్ తనకి నచ్చడంతో సాంగ్ కంపోజ్ చేసే పనిలో పడ్డారు. ప్రోమో బిట్ సిద్ధంగా ఉన్నా సింగర్ తో పాడించాల్సిన అవసరం ఉందంట. తమన్ ముందుగా ఇచ్చిన కొన్ని ట్యూన్స్ మహేష్ బాబుకి నచ్చలేదంట. దేంతో వేరొక మ్యూజిక్ డైరెక్టర్ తో వెళ్తామని సూపర్ స్టార్ చెప్పారంట.

అయితే మరో అవకాశం తమన్ కి ఇవ్వడం, అతను ప్రూవ్ చేసుకోవడంతో ఫైనల్ గా గుంటూరు కారం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఫిక్స్ అయినట్లే అని టాక్. బర్త్ డే కి సాంగ్ తో సప్రైజ్ ఇవ్వాలని అనుకున్న సెట్ కాలేదు. అందుకే త్రివిక్రమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచారు.